AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishab Shetty: చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూశా.. ఓటీటీ ట్రెండింగ్ మూవీపై రిషబ్ ప్రశంసలు

కాంతారా ఛాప్టర్ 1 తర్వాత జై హనుమాన్ సినిమా పనుల్లో బిజీ అయిపోయాడు కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి. టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే తాజాగా ఓ చిన్న సినిమాను చూసిన రిషబ్ సోషల్ మీడియా వేదికగా ఆ చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించాడు.

Rishab Shetty: చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూశా.. ఓటీటీ ట్రెండింగ్ మూవీపై రిషబ్ ప్రశంసలు
Rishab Shetty
Basha Shek
|

Updated on: Apr 20, 2026 | 6:33 PM

Share

ఇటీవల సంచలన విజయం సాధించిన చిన్న సినిమా యూత్. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రణ్ వీర్ బ్లాక్ బస్టర్ ధురంధర్ ది రివేంజ్ ను తట్టుకుని మరీ ఈ మూవీ భారీ కలెక్షన్లు రాబట్టింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిన్న సినిమాకు రికార్డు కలెక్షన్లు వచ్చాయి. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ముఖ్యంగా యూత్ అయితే ఈ సినిమాను ఎగబడి చూసేశారు. సామాన్యులే కాదు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను చూసి ప్రశంసలు కురిపించారు. తాజాగా కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి యూత్ సినిమాను మెచ్చుకున్నారు. ఈ మూవీని చూసిన ఆయన సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘చాలాకాలం తర్వాత ఒక మంచి సినిమా చూశాను. ఈ మూవీని చూస్తున్నంతసేపు నేను నవ్వుతూనే ఉన్నాను. ‘యూత్’ సినిమాలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. ఈ సినిమా తల్లిదండ్రులకు ఇచ్చిన ఒక గొప్ప బహుమతి. తెరపై నటీనటులంతా చాలా సహజంగా కనిపించారు. ఈ సినిమా డైరెక్టర్ కెన్‌ కరుణాస్‌ ఇండస్ట్రీకి లభించిన ఒక గొప్ప ఆస్తి’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు రిషబ్ శెట్టి. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

27 ఏళ్ల కెన్ కరుణాస్ యూత్ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు మెయిన్ హీరోగా నటించాడు. అనిష్మా అనిల్ కుమార్, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు,మళయాళం, కన్నడ, హిందీ తదితర ప్రభాన భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.

రిషభ్ శెట్టి ట్వీట్..

నెట్ ఫ్లిక్స్ లో యూత్ సినిమా ట్రెండింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..