సంచలన దర్శకుడు ఆర్జీవీ(Ram Gopal Varma)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సమస్య ఏదైనా తనదైన శైలిలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు వర్మ. ఇక ఆయన సినిమాల గురించి చెప్పాల్సిన పనిలేదు. రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే చాలు ..కాంట్రవర్సీలు కోకొల్లలుగా వచ్చిపడుతుంటాయి. ఇక ట్వీట్టర్‌లో వర్మ చేసే హల్ చల్ గురించి అందరికి తెలిసిందే.. వర్మ ఎప్పుడు ఎలాంటి పోస్ట్ పెడతాడో.. ఏ విషయంపై ఎలా స్పందిస్తాడో ఊహించడం కష్టమే. తనకు నచ్చింది చేయడం.. మనసులోని మాటలను మొహమాటం లేకుండా బయటపెట్టడం ఆర్జీవి స్టైల్. వర్మ చేసే పోస్ట్స్, వీడియోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేయడం ఆయన నైజం.. ట్వీట్లతో రచ్చ చేయడం.. ఆయనకున్న గొప్పతనం.. ఏదేని ఒక బర్నింగ్ టాపిక్‌ను వ్యగ్యంగా చెప్పడం.. అవసరమైతే మరో లెవల్లో ఇష్యూ అయ్యేలా చేయడం అర్జీవికే సాధ్యమైన తుంటరి తనం. తాజాగా ఆయన మరోసారి ట్వీట్ తో హాట్ టాపిక్ గా మారారు.
రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘డేంజరస్'(తెలుగులో ‘మా ఇష్టం’)సినిమాకు షాక్ తగిలింది. ఏప్రిల్ 8న ఈ సినిమాను దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించిన వర్మకు ఊహించని పరిణామం ఎదురైంది. ఈ మూవీని ప్రదర్శించేందుకు పీవీఆర్, ఐనాక్స్ థియేటర్లు అభ్యంతరం వ్యకం చేయడంతో ఇష్యూ హాట్ టాపిక్ అయింది. దీనిపై కూడా వర్మ తన స్టైల్ లో ట్వీట్ చేశారు. పీవీఆర్, ఐనాక్స్ థియేటర్ల తీరు సుప్రీం కోర్టు తీర్పునే వ్యతిరేకించేలా ఉందంటూ కౌంటర్ వేశారు. తాజాగా వర్మ మరోసారి ఈ ఇష్యుని హైలైట్ చేస్తూ తనదైన రీతిలో ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ వీడియోను షేర్ చేశారు ఆర్జీవీ.
DANGEROUS 2.0 ??? pic.twitter.com/Hy2Q6epTPl
— Ram Gopal Varma (@RGVzoomin) April 6, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :