RGV Comments: టాలీవుడ్ దర్శకుల్లో ఏ దర్శకుడికి లేనంత క్రేజ్ ఆర్జీవీకి సొంతం.. ఆయన సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా జనల నోళ్ళల్లో నానుతుంటారు. నిజానికి ఆర్జీవీ ఎక్కడుంటే వివాదం అక్కడుంటుంది. చిన్న విషయమైన ఆర్జీవీ దాన్ని సంచలనం చేస్తారు. ఇప్పటికే పలు వివాదస్పద సినిమాలతో హాట్ టైపిక్ అయిన వర్మ. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇక ట్విటర్‌లో ఆర్జీవీ ట్వీట్స్ ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా వర్మ మూఢ నమ్మకాలు, భ్రమల గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ప్రతి ఒక్కరికి సైంటిఫిక్ అండర్ స్టాండ్ ఉండటానికి ఛాన్స్ లేదని అప్పుడు చాలామంది సైంటిస్ట్‌ని నమ్ముతారని వర్మ అన్నారు. అయితే ఒక్కోసారి సైన్స్ కూడా తప్పు చేసిందని చెబుతుందన్నారు ఎందుకంటే ఇది కంటిన్యూస్‌గా ప్రోగ్రెస్‌లో ఉండదని తెలిపారు. “నేను తప్పిస్తే ప్రపంచమే లేదని అనుకుంటే అది కరెక్ట్ అవుతుంది. నిద్రపోయినప్పుడు కలలో జరిగేవి మనం నిజమే అనుకుంటాం. మేల్కొనే వరకు అదే నిజమని ఫీలవుతాం. మన ఇంద్రియాలు కూడా అదే నిజమని ఒక భ్రమను కలిగిస్తాయి. ఇదే లెక్కన నమ్మకం, మూఢ నమ్మకం విషయంలో ఆ వ్యక్తి దేనిని నమ్ముతున్నాడు అనేది అతడిపై ఆధారపడి ఉంటుందని తెలిపారు” ప్రతి వ్యక్తికి ఒక సఫరేట్ ప్రపంచం ఉంటుందని ఆ ప్రపంచంలో దెయ్యాలు ఉన్నాయా, దేవుళ్లు ఉన్నారా అని ఒక అంచనా వేసుకుంటాడని వర్మ తెలిపారు. అయితే ఆ ప్రపంచానికి సంబంధం లేని వారికి ఈ విషయం మూఢనమ్మకంగా అనిపిస్తుందని వివరించే ప్రయత్నం చేశారు.