
మరికొన్ని రోజుల్లో 2025 ముగియబోతోంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ రెడీ అవుత్నారు. అసలు వియానికి వస్తే.. ఈ సంవత్సరం చాలా సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. అయితే ఈ సంవత్సరం ఏ సినిమా కూడా వెయ్యి కోట్ల రూపాయల క్లబ్‌లోకి చేరలేదు. కానీ 500+ కోట్ల రూపాయల క్లబ్‌లోకి చేరిన సినిమాలు చాలా ఉన్నాయి. ఈ షాకింగ్ విషయం ఏమిటంటే ఈ జాబితాలో అసలు ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఈ ఏడాది తెలుగులో బ్లాక్ బస్టర్ మూవీ అంటే పవన్ కల్యాణ్ ఓజీనే అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఈ మూవీ రూ.320 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ ఏడాది తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
విక్కీ కౌశల్, రష్మిక మందన్న తదితరులు నటించిన ‘ఛావా’ చిత్రం ఈ సంవత్సరం విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 807 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో ఛత్రపతి శివాజీ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రను అద్బుతంగా పోషించాడు విక్కీ కౌశల్.
రజనీకాంత్ నటించిన ‘కూలీ’ ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. టేకింగ్ పరంగా విమర్శలు వచ్చినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 500+ కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు.
ఈ ఏడాది భారీ విజయం సాధించిన బాలీవుడ్ చిత్రం ‘సైయర్’. ఈ మూఈ కూడా రూ. 500 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. ఈ చిత్రంలో అనిత్ పద్దా అహన్ పాండే నటించారు జంటగా నటించారు.. ఇద్దరూ కొత్త ముఖాలు అయినప్పటికీ, ఈ చిత్రం సూపర్ హిట్ అయింది.
రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ సూపర్ హిట్ అయింది. ఈ సినిమా వసూళ్లు దాదాపు 900 కోట్ల రూపాయలు. రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్.ఈ సంవత్సరం అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా ఇదే.
ధురందర్ రెండు వారాల్లో రూ. 400 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ కలెక్షన్ ఇప్పటికే రూ. 500 కోట్లు దాటింది. ఇందులో రణవీర్ సింగ్ నటించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.