RGV: ఆర్జీవీ పై మరో కేసు.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన రిటైర్డ్ మహిళా ఐపీఎస్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు వివాదాల్లోనూ ఇరుక్కున్నారు ఆర్జీవీ. ఇప్పటికే వ్యూహం సినిమా ప్రమోషన్స్ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేసినందుకు ఆయన పై పలు కేసులు నమోదు అయ్యాయి.

RGV: ఆర్జీవీ పై మరో కేసు.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన రిటైర్డ్ మహిళా ఐపీఎస్
Rgv

Updated on: Sep 18, 2025 | 9:29 AM

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. మొన్నామధ్య వ్యూహం సినిమా వివాదంలో పోలీస్ స్టేషన్ చుట్టూ.. కోర్టులు చుట్టూ తిరిగారు.. దాని నుంచి బయటపడేలోగా మరో కేసులో ఆర్జీవి ఇరుక్కున్నారు. రామ్ గోపాల్ వర్మ పై మరో కేసు నమోదు అయ్యింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో రిటైర్డ్ మహిళా ఐపీఎస్ రామ్ గోపాల్ వర్మ పై ఫిర్యాదు చేశారు. దహనం వెబ్ సిరీస్ పై ఫిర్యాదూ చేశారు రిటైర్డ్ ఐపీఎస్.

మనుషుల్నిపీక్కుతిండం ఏంట్రా బాబు..! ఒకే సినిమాలో ఆరు స్టోరీలు.. దైర్యమున్నోళ్లే చూడండి

తన అనుమతి లేకుండా తన ప్రొఫైల్ ను దహనం అనే వెబ్ సిరీస్ లో వాడారని మహిళ రిటైర్డ్ ఐపీఎస్ ఫిర్యాదు చేశారు.  దహనం సినిమాకు డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ గా ఉన్నారు రామ్ గోపాల్ వర్మ. దాంతో రామ్ గోపాల్ వర్మ పై కేస్ నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. రామ్ గోపాల్ వర్మ పై పోలీసులు IPC 509, 468, 469, 500, and 120(B).సెక్షన్ ల కింద కేస్ నమోదు చేశారు పోలీసులు.

ఆరుగురు పిల్లల తండ్రితో ఎఫైర్.. పెళ్లి కాకుండా ఇద్దరు పిల్లలకు తల్లైంది.. ఆమె కూతురు కూడా స్టార్ హీరోయిన్

ఫ్యూడలిస్టులు, నక్సలైట్లకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో దహనం అనే సిరీస్ ను తెరకెక్కించారు రామ్ గోపాల్ వర్మ. కమ్యూనిస్ట్‌ నేత రాములును ఎలా హత్య చేశారు.. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న ఓ కొడుకు కథగా ఈ వెబ్‌ సిరీస్‌ను నిర్మించారు రామ్ గోపాల్ వర్మ. రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి చెప్పిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించాం అని ఆర్జీవీ తెలిపారు. అయితే అందులో వాస్తవం లేదని సినిమాలో తప్పుగా చూపించారని రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారిణి అంజనా సిన్హా పోలీసులకు ఫిర్యాదు చేశారు.  అనుమతి లేకుండా తన పేరును వాడటం పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

13 ఏళ్లకు హీరోయిన్.. 19ఏళ్లకే కనబడకుండాపోయింది.. ఇప్పుడు సినిమాలు మానేసి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.