Renu Desai: కూతురు ఆద్యతో కలిసి రేణు దేశాయ్ డాన్స్.. వైరలవుతున్న వీడియో..

|

Apr 28, 2024 | 4:03 PM

తాజాగా రేణు దేశాయ్ షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. అందులో తన ఫేవరేట్ డ్యాన్స్ పార్ట్నర్‏ను అభిమానులకు పరిచయం చేసింది. ఇంతకీ ఆ డాన్స్ పార్ట్నర్ ఎవరో తెలుసా ?. ఇంకెవరు రేణు దేశాయ్ గారాలపట్టి ఆద్య. వీరిద్దరు కలసి ఫన్నీగా డాన్స్ చేసిన వీడియోను షేర్ చేశారు రేణు దేశాయ్.

Renu Desai: కూతురు ఆద్యతో కలిసి రేణు దేశాయ్ డాన్స్.. వైరలవుతున్న వీడియో..
Renu Desai, Aadya
Follow us on

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. రోజూ కూతురు ఆద్య, కుమారుడు అకిరా నందన్ గురించి ఏదోక విషయం షేర్ చేస్తుంటుంది. అలాగే వీరు ముగ్గురు కలిసి సరదాగా గడుపుతున్న ఫోటోస్ సైతం అప్పుడప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా రేణు దేశాయ్ షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. అందులో తన ఫేవరేట్ డ్యాన్స్ పార్ట్నర్‏ను అభిమానులకు పరిచయం చేసింది. ఇంతకీ ఆ డాన్స్ పార్ట్నర్ ఎవరో తెలుసా ?. ఇంకెవరు రేణు దేశాయ్ గారాలపట్టి ఆద్య. వీరిద్దరు కలసి ఫన్నీగా డాన్స్ చేసిన వీడియోను షేర్ చేశారు రేణు దేశాయ్.

ఈ వీడియోను షేర్ చేస్తూ “నా ఫేవరేట్ డ్యాన్సింగ్ పార్ట్నర్.. మనకు ఇష్టమైన వారితో డాన్స్ చేస్తే థెరపీలా పనిచేస్తుంది” అంటూ రాసుకొచ్చింది. అయితే ఈ వీడియోలో మొదట ఆద్య ఫేస్ చూపించకుండా తను మాత్రమే డాన్స్ చేస్తూ ఆ తర్వాత ఆద్య ఫేస్ రివీల్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుండగా.. అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. ఆద్య ఎంతో కూల్ గా .. అందంగా డాన్స్ చేస్తుందని.. ఇద్దరూ తల్లికూతుళ్లుగా కాకుండా అక్కచెల్లిగా కనిపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొట్టేస్తున్న వీడియోను మీరు చూసేయ్యండి.

ఇదిలా ఉంటే.. అకిరా నందన్, ఆద్యకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట క్షణాల్లో వైరలవుతుంటాయి. గతంలో బుల్లితెరపై ఓ ఛానల్లో నిర్వహించిన రియాల్టీ షోలో మొదటిసారి కనిపించింది ఆద్య. అలాగే ఈ ఏడాది బెంగుళూరులో మెగా ఫ్యామిలీతో కలిసి సంక్రాంతి సంబరాల్లో సందడి చేశారు ఆద్య, అకిరా. ఇక ప్రస్తుతం విదేశాల్లో ఇష్టమైన కోర్సులు నేర్చుకుంటున్నాడు అకీరా నందన్. ఇప్పటికే మ్యూజిక్ క్లాసులకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.