Sri Ramana: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. మిథునం రచయిత శ్రీరమణ కన్నుమూత

|

Jul 19, 2023 | 9:54 AM

తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. మిథునం కథా రచయిత శ్రీరమణ (70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో..

Sri Ramana: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. మిథునం రచయిత శ్రీరమణ కన్నుమూత
Writer Sri Ramana
Follow us on

తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది.  మిథునం మువీ కథా రచయిత శ్రీరమణ (70) ఈ రోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం వేకువజామున 5 గంటలకు స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. దీంతో చిత్రసీమలో విషాదం నెలకొంది. శ్రీరమణ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

శ్రీరమణ టాలీవుడ్‌లో ఎన్నో చిత్రాలకు రచయితగా వ్యవహరించారు. జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన బాపు, రమణలతో పాటు మరెంతో మందితో శ్రీరమణ పనిచేశారు. ఎన్నో సినిమాలకు కథా రచయితగా, డైలార్ రైటర్‌గా పనిచేశారు. ముఖ్యంగా ఆయన పేరడీ రచనలకు ఫేమస్‌. గతంలో ఆయన ‘నవ్య’ వారపత్రికకు ఎడిటర్‌గానూ పనిచేశారు. తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన మిథునం సినిమాకు కథ అందించింది ఈయనే. ఆ సినిమా శ్రీ రమణకు మంచి పేరు వచ్చింది. కాగా ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.