Gopichand’s Seetimaarr: వాయిదా పడనున్న గోపీచంద్ సీటీమార్ రిలీజ్.. కారణం ఇదే

|

Mar 28, 2021 | 2:36 PM

యాక్షన్ హీరో గోపీచంద్ రీసెంట్ గా తాను నటించిన సినిమాలు అన్నీ ప్లాపులుగా నిలిచాయి. దాంతో పాటు గోపీచంద్ మార్కెట్ కూడా పూర్తిగా దెబ్బతింది. ఇక కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో పడ్డాడు.

Gopichands Seetimaarr: వాయిదా పడనున్న గోపీచంద్ సీటీమార్ రిలీజ్.. కారణం ఇదే
Seetimaarr
Follow us on

Gopichand’s Seetimaarr: యాక్షన్ హీరో గోపీచంద్ రీసెంట్ గా తాను నటించిన సినిమాలు అన్నీ ప్లాపులుగా నిలిచాయి. దాంతో పాటు గోపీచంద్ మార్కెట్ కూడా పూర్తిగా దెబ్బతింది. ఇక కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో పడ్డాడు. ప్రస్తుతం ఈ హీరో నటిస్తోన్న చిత్రం సీటిమార్. తనతో గౌతమ్ నంద వంటి చిత్రాన్ని చేసిన సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకుడు. తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. గోపీచంద్, తమన్నా ఇద్దరూ కూడా కబడ్డీ కోచ్ లుగా ఈ సినిమాలో నటిస్తున్నారు. పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. గోపీచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ సినిమా రూపొందుతోంది. మెలొడీ బ్రహ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. సినీయర్ నటి భూమిక చావ్లా కీల‌క పాత్రలో పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల ఇప్పుడు వాయిదా పడినట్టు తెలుస్తుంది.

సమ్మర్ ను టార్గెట్ చేసి చాలా సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో వరుసగా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. తాజాగా  గోపీచంద్ ‘సీటిమార్’ సినిమా వాయిదా వేశారు మేకర్స్. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్.  అదే రోజు 2న కింగ్ నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ అలాగే తమిళ హీరో కార్తీ నటించిన ‘సుల్తాన్’ సినిమాలు విడుదల కాబోతుండటంతో సీటిమార్ సినిమాను వాయిదా వేశారు మేకర్స్. పోటీలేకుండా  సోలోగా  సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిత్ర నిర్మాతలు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Radhe Shyam Movie: రాధేశ్యామ్ సినిమానుంచి క్రేజీ అప్డేట్ .. ఖుషీలో రెబల్ స్టార్ అభిమానులు..