Andhra Pradesh: ఇంట్లోకి దూసుకొచ్చిన కారు.. అందులో ఏముందో చెక్ చేసి కంగుతిన్న పోలీసులు

|

Feb 02, 2022 | 4:38 PM

చైనా, జపాన్‌లలో వంటింట్లో వాడే పాత్రలు, గిన్నెలు కూడా ఎర్రచందనం తో చేసినవి వాడుతుంటారు. సంగీత వాయిద్యాలు తయారు చేసి పెళ్లిళ్ల లో బహుమతిగా ఇస్తుంటారు. అందుకే ఎర్ర చందనానికి అంత డిమాండ్.

Andhra Pradesh: ఇంట్లోకి దూసుకొచ్చిన కారు.. అందులో ఏముందో చెక్ చేసి కంగుతిన్న పోలీసులు
Ap Accident
Follow us on

AP Accident: ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం.. ఏపీ రాయలసీమ(Rayalaseema) ప్రాంతంలో ఉన్న శేషాచలం కొండల్లో మాత్రమే దొరుకుతుంది. శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనంలో ఎక్కువ చేవ ఉండడంతో దానికి ఇంటర్నేషనల్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.  జపాన్, చైనా, రష్యాలలో ఎర్ర చందననాన్ని వివిధ రూపాల్లో వినియోగిస్తుంటారు. ఫారెన్‌లో ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి స్మగ్లర్లు అనేక మార్గాల్లో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. అందుకోసం కొందరు ప్రాణాలకు తెగిస్తున్నారు. కాగా ఇటీవల ఎర్రచందనం బ్యాగ్రౌండ్‌లో వచ్చిన ‘పుష్ప'(Pushpa) చిత్రం బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా( chittoor district)లో ఎర్ర‌చంద‌నం స్మగ్లర్లు పుష్పలో అల్లు అర్జున్ మాదిరి ఏ మాత్రం తగ్గేదే లేదంటున్నారు. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా రెడ్‌ శాండిల్‌ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. తాజాగా ఎర్రచందనం దుంగ‌ల‌తో త‌ర‌లివెళ్తున్న ఓ కారు యాక్సిడెంట్‌కు గురైంది.

పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై శ్రీకాళహస్తి సమీపంలోని పెద్ద కన్నలి ఎస్టీ కాలనీ వద్ద ఎర్రచందనం దుంగలతో వెళుతున్న కారు ఎదురుగా వస్తున్న వాహనం తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న ఓ ఇంటిని ఢీకొట్టింది. అంత‌లోనే బోల్తా ప‌డి ప‌ల్టీలు కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు పరారయ్యారు. కారులో 8 ఎర్రచందనం దుంగలు ఉండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారు ఢీకొట్ట‌డంతో ధ్వంసమైన ఇంటిలో నివసిస్తున్న దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు, అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Also Read: ఎరువుల లోడ్ అనుకుంటే పొరబడినట్లే.. అస్సలు యవ్వారం తెలిస్తే వామ్మో అంటారు

సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన వినూత్నమైన పడవ.. అనుమానంతో మత్స్యకారులు చెక్ చేయగా…