రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. వరదల ధాటికి ;జనజీవనం అస్తవ్యస్తంగా తయారయ్యింది. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడ చూసిన నీరే కనిపిస్తుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇక వరద బాధితులను ఆదుకోవడానికి సినీ రంగం ముందుకు వచ్చింది. స్టార్ హీరోలు, నిర్మాతలు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాలను అందిస్తున్నారు. ఇప్పటికే ఆయ్ మూవీ యూనిట్, కల్కి నిర్మాతలు అశ్విని దత్త (రూ. 25 లక్షలు), ఎన్టీఆర్( తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 1కోటి), విశ్వక్ సేన్( రూ. 10లక్షలు), సిద్ధూ జొన్నలగడ్డ(రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.30లక్షలు), సూపర్ స్టార్ మహేష్ బాబు( రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.1 కోటి ), బాలకృష్ణ (రూ. 1 కోటి), పవన్ కళ్యాణ్ ( రూ.1కోటి ), నటి అనన్య నాగళ్ళ ( రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.5లక్షలు) అందించారు.
తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ వరదబాధితులను ఆదుకునేందుకు భారీ విరాళం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి రూ. 2 కోట్ల విరాళం ప్రకటించారు ప్రభాస్. అలాగే వరదలకు గురైన ప్రాంతలో ప్రజలకి భోజనాలు, మంచి నీళ్లు ఏర్పాటు చేశారు ప్రభాస్. ప్రభాస్ రూ.2 కోట్ల విరాళం ప్రకటించడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలను భారీ వరదలు మూడు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ నెమ్మదిగా శాంతిస్తోంది. ఈ మధ్యాహ్నం వరకు మరింత తగ్గుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్నడూ లేనంతగా 11.47లక్షల క్యూసెక్కుల నీరు చేరడంతో చరిత్రలో ఇదే రికార్డు స్థాయి నీటి ప్రవాహమని, అయినప్పటికీ ప్రకాశం బ్యారేజీ తట్టుకుని నిలబడిందని అధికారులు చెప్పారు. అయితే ఇవాళ వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి