Ponniyin Selvan: మణిరత్నం కీలక నిర్ణయం.. పొన్నియన్ సెల్వన్ కోసం ఇలా..

|

Sep 29, 2022 | 12:26 PM

ఈ స్టార్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ పొన్నియన్ సెల్వన్. తమిళ్ స్టార్ హీరో విక్రమ్ చియాన్, కార్తి, ఐశ్వర్య రాయ్, త్రిష, జయం రవి, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ మూవీ పై ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.

Ponniyin Selvan: మణిరత్నం కీలక నిర్ణయం.. పొన్నియన్ సెల్వన్ కోసం ఇలా..
Ponniyin Selvan
Follow us on

మణిరత్నం తెరకెక్కించే సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోతుంటాయి. సినీ ఇండస్ట్రీలో మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు సంపాదించుకున్న మణిరత్నం. ఈ స్టార్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ పొన్నియన్ సెల్వన్. తమిళ్ స్టార్ హీరో విక్రమ్ చియాన్, కార్తి, ఐశ్వర్య రాయ్, త్రిష, జయం రవి, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ మూవీ పై ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. చోళుల స్వర్ణయుగాన్నిఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ ఓ నవల ఆధారంగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ నవల తమిళనాడు చాలా ప్రసిద్ధి చెందింది. దీనిని సినిమా చేయాలనీ ఎంజేఆర్ నుంచి కమల్ హాసన్ వరకు చాలా మంది ప్రయతించారు. మొత్తంగా ఇప్పుడు మణిరత్నం పుణ్యమా అని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇప్పటికే వరుస ప్రెస్ మీట్స్ తో సందడి చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో కరికాలన్‌గా విక్రమ్.. అరుణ్ మోళి వర్మన్‌గా జయం రవి.. వల్లవరాయన్ వాందివదేవన్‌గా కార్తి.. నందినిగా ఐశ్వర్యారాయ్.. కుందవై పిరిత్తియార్‌గా త్రిష నటిస్తున్నారు. ఇదిలా ఉంటే త్రిష, ఐశ్వర్య రాయ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెట్ లో ఈ ఇద్దరు దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో రాణులుగా నటించిన ఐశ్వర్య, త్రిష నగలను ఇప్పుడు వేలం వేయనున్నారట చిత్రయూనిట్. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో విక్రమ్ ప్రభు, శోభితా ధూళిపాల, పార్తీబన్, శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.  చాలా కాలం తర్వాత మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ సినిమాకోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..