Krack: మ‌రోసారి థియేట‌ర్ల‌లో ఒంగోలు జాతర.. త‌గ్గేదే లేదంటున్న మాస్ మ‌హారాజా.. బుకింగ్ కూడా షురూ

సంక్రాంతి గ్యాప్ లో వచ్చి కిర్రాక్ అనిపించారు మాస్ మహారాజ్ రవితేజ. ఒంగోలు జాతర ఓ రేంజ్ లో షురూ చేసుకున్నారు...

Krack: మ‌రోసారి థియేట‌ర్ల‌లో ఒంగోలు జాతర.. త‌గ్గేదే లేదంటున్న మాస్ మ‌హారాజా.. బుకింగ్ కూడా షురూ
krack
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 15, 2021 | 10:44 AM

సంక్రాంతి గ్యాప్ లో వచ్చి కిర్రాక్ అనిపించారు మాస్ మహారాజ్ రవితేజ. ఒంగోలు జాతర ఓ రేంజ్ లో షురూ చేసుకున్నారు. ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాతొచ్చే గ్యాప్ కూడా తనదే అంటున్నారు. ఎస్… క్రాక్ మేనియా ఒన్స్ ఎగెయిన్ రిపీట్ అవుతోందట. గతంలో ఫస్ట్ వేవ్ కూల్ డౌన్ కాగానే థియేటర్లో పడే ఫస్ట్ షో తనదే అంటూ రామ్ గోపాల్ వర్మతో పాటు చాలామంది తమ తమ సినిమాలతో ముందుకొచ్చారు. అలా అన్ లాక్ అయిందో లేదో ఇలా క్యూ కట్టేశాయి కొన్ని చిన్నాపెద్దా సినిమాలు. సరిలేరు నీకెవ్వరూ లాంటి బ్లాక్ బస్టర్లు కూడా రీరిలీజ్ కి సై చెప్పేశాయి. మరి.. ఈసారి జులైలో అన్ లాక్ అవగానే.. థియేటర్లో పడ్డానికి బొమ్మలెక్కడ? అంటున్నారు ప్రేక్ష‌క జ‌నం.

ఆర్నెల్ల కిందట సంక్రాంతి సీజన్లో ధమాకా పేల్చిన క్రాక్ మూవీ.. మరోసారి ఆడియెన్స్ పల్స్ రేట్ చూడ్డానికి రెడీ అవుతోంది. రీరిలీజ్ కి సిద్ధంగా ఉన్నామంటూ సంకేతాలిచ్చారు క్రాక్ మూవీ మేకర్స్. గత వీకెండ్ లో చిన్న శాంపిల్ కూడా చూపించారు. వైజాగ్ లోని జగదాంబ థియేటర్ ఓనర్.. ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీతో క్రాక్ మూవీకి బుకింగ్ కూడా షురూ చేశారు. లాక్ డౌన్ గైడ్ లైన్స్ కి విరుద్ధం అంటూ అధికారులొచ్చి తలుపులు మూసేసరికి.. ఫస్ట్ షోకి ఆ విధంగా బ్రేక్ పడింది. బట్.. అఫీషియల్ గా జీవో రాగానే క్రాక్ మూవీతోనే మేజర్ నంబరాఫ్ బిగ్ స్క్రీన్స్ రీఓపెన్ అయ్యే ఛాన్సుందట. పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పర్ఫెక్ట్ థియేటర్ ఫీల్ నిచ్చే క్రాక్ తప్పితే.. ఇప్పట్లో రిలీజ్ కోసం మరే మూవీ సిద్ధంగా లేదు. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న చిన్న సినిమాల కంటే.. క్రాక్ లాంటి ఖతర్నాక్ మూవీస్ అయితేనే బెటర్.

Also Read: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ సేవలకు అంతరాయం

విమానంలో సాంకేతిక సమస్య… ఈటెల బృందానికి తప్పిన పెను ప్రమాదం..