మా ఇంట్లో 10 మందికి కరోనా వచ్చింది.. మానసికంగా.. శారీరకంగా కష్టాలు.. రవితేజ హీరోయిన్ ఎమోషనల్ ..

Dimple Hayathi: దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. రోజు రోజుకూ కరోనా కేసులు లక్షలు దాటుతుండటం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది.

మా ఇంట్లో 10 మందికి కరోనా వచ్చింది.. మానసికంగా.. శారీరకంగా కష్టాలు.. రవితేజ హీరోయిన్ ఎమోషనల్ ..
Dimple Hayati

Updated on: May 20, 2021 | 10:48 PM

Dimple Hayathi: దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. రోజు రోజుకూ కరోనా కేసులు లక్షలు దాటుతుండటం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. కోవిడ్ ప్రభావం.. సినీ ఇండస్ట్రీని మాత్రం వదడలం లేదు. గత కొంతకాలంగా పలువురు నటీనటులు కరోనా బారిన పడుతుండటం కలవరపెడుతోంది. ఇప్పటికే చాలా మంది ప్రముకులు ఈ మహమ్మారి వలన చనిపోగా.. మరికొందరు తమ ఆత్మీయులను పోగొట్టుకున్నారు. ఇప్పటికే దీపికా పదుకునే, శిల్పాశెట్టి కుటుంబాలు కరోనా బారిన పడగా.. తాజాగా మరో హీరోయిన్ కుటుంబం కూడా కోవిడ్ బారిన పడింది.

హీరోయిన్ డింపుల్ హయతి కుటుంబంలో పది మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. మాది ఉమ్మడి కుటుంబం.. ఇంట్లో పది మందికి కరోనా సోకింది.. వారం రోజులుగా శారీరకంగా… మానసికంగా కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.. మా కుటుంబ సభ్యుల పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది అంటూ ఎమోషనల్ ట్విట్ చేసింది. ప్రస్తుతం తన తాతయ్య చెన్నైలోని ఓ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం డింపుల్ హయతి.. రవితేజ ప్రధాన పాత్రలో రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఖిలాడి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా నేపథ్యంలో షూటింగ్స్ లేకపోవడంతో డింపుల్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటుంది. ఇలాంటి కష్టకాలంలో తన కుటుంబం వెంట తాను లేనందుకు బాధపడుతుంది ఈహీరోయిన్..

Also Read: రాఘవేంద్రుడి పుట్టిన రోజున మరో సర్‏ఫ్రైజ్.. దర్శకేంద్రుడి అభిమానులకు ‘పెళ్లి సందడి’ టీం స్పెషల్ ట్రీట్..

CoviSelf corona test: ఇంటి వద్దే కోవిడ్‌ పరీక్ష.. 5 నిమిషాల్లోనే ఫలితం.. అందుబాటులోకి మైలాబ్ కోవిడ్ సెల్ఫ్ టెస్టింగ్ కిట్

మొదటి COVID-19 సోకినా వారు వాక్సిన్ కోసం తర్వాత ఎంతసేపు వేచి ఉండాలి? వీడియో :Infected after first COVID-19 jab video .

Private Hospitals : హాస్పిటల్స్ అక్రమాలపై ఫిర్యాదు చేయడానికి సంప్రదించాల్సిన నోడల్ అధికారుల వివరాలు, ఫోన్ నెంబర్లు