Ravi Teja: అత్యాధునిక హంగులు, సదుపాయాలతో ర‌వితేజ మ‌ల్టీ ప్లెక్స్ .. ఆ స్టార్ హీరో సినిమాతో ఓపెనింగ్

మాస్ మహారాజా రవి తేజ మల్టీ ప్లెక్స్ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టాడు.హైదరాబాద్ లో అత్యాధునిక సదుపాయాలు, హంగులతో నిర్మిస్తోన్న మల్టీప్లెక్స్ నిర్మాణం ముగింపు దశకు చేరుకుంది. త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఓ స్టార్ హీరో సినిమాతో ఈ మల్టీ ప్లెక్స్ ఓపెన్ కాబోతుంది.

Ravi Teja: అత్యాధునిక హంగులు, సదుపాయాలతో ర‌వితేజ మ‌ల్టీ ప్లెక్స్ .. ఆ స్టార్ హీరో సినిమాతో ఓపెనింగ్
Ravi Teja Multiplex Art Cinemas

Updated on: Jul 10, 2025 | 10:36 PM

సినిమాల్లో స్టార్ హీరోలుగా వెలుగొందుతోన్న వారిలో చాలా మంది థియేటర్ బిజినెస్ రంగంలోనూ సత్తా చాటుతున్నాు. ఇప్పటికే ఏఎంబీ సినిమాస్ తో మహేష్ బాబు, అలాగే ఏఏఏ సినిమాస్ తో అల్లు అర్జున్ హైదరాబాద్ లో మల్టీ ప్లెక్స్ లు ఏర్పాటు చేశారు. ఇక విజయ్ దేవరకొండతో ఏవీడీ సినిమాస్ పేరుతో మల్టీ ప్లెక్స్ ను ఏర్పాటు చేశాడు. త్వరలోనే ఏపీలోనూ ఈ మల్టీ ప్లెక్స్ లు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడీ మల్టీ ప్లెక్స్ బిజినెస్ లోకి మాస్ మహరాజా రవితేజ కూడా అడుగు పెట్టాడు. కొన్ని నెలల క్రితమే హీరో రవితేజతో కలిసి ఏసియన్ సంస్థ ఓ మల్టీప్లెక్స్ నిర్మాణాన్ని ప్రకటించింది. హైదరాబాద్ శివారు వనస్థలిపురం ప్రాంతంలో ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే దాదాపు నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలుస్తోది.  ప్రస్తుతం ఇంటీరియర్ వర్క్ జరుగుతోందని సమాచారం. త్వరలోనే ఈ మల్టీప్లెక్స్‌ను గ్రాండ్‌గా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. కాగా ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవాన్ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లుతో ప్రారంభించాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ జూలై 24న విడుదల కానుంది. సో .. కాబట్టి.. అదే రోజున రవితేజ మల్టీప్లెక్స్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన ఇంకా రావలసి ఉంది.

 

ఇవి కూడా చదవండి

అత్యాధునిక సదుపాయాలతో..

కాగా ఏఆర్ టీ మల్టీప్లెక్స్‌ను అత్యాధునిక సాంకేతికతతో నిర్మించినట్లు సమాచారం సుమారు 57 అడుగుల వెడల్పుతో భారీ స్క్రీన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, సినిమా ప్రేమికులకు సరికొత్త అనుభూతిని అందించే విధంగా సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయయని తెలుస్తోంది. ఇప్పటికే పలు సార్లు టెస్టింగ్ ప్రక్రియ కూడా పూర్తయిన‌ట్టు తెలుస్తుంది. త్వరలో టాలీవుడ్ ప్రముఖులతో ఈ మల్టీ ప్లెక్స్ ను గ్రాండ్ గా ఓపెనింగ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

హరి హర వీరమల్లుతో ఓపెనింగ్..

 

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రవితేజ మాస్ జాతర సినిమాలో నటిస్తున్నాడు. ధమాకా తర్వాత  శ్రీలీల మరోసారి మాస్ మహరాజాతో జత కట్టనుంది.

మాస్ జాతర సినిమాలో రవితేజ, శ్రీలీల..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.