నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో బింబిసార మూవీ ఒకటి. హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ లో నటించి ఆకట్టుకున్నాడు. ఆగస్ట్ 5న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అతి పెద్ద విజయాన్ని సాధించిన చిత్రంగా నిలిచింది బింబిసారా. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. థియేటర్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా అటు ఓటీటీలోనూ మంచి వ్యూస్ ను రాబట్టింది. ఈ సినిమాలో టైమ్ ట్రావెలింగ్ సబ్జెక్ట్‌ను చాలా ఆసక్తికరంగా చూపించాడు దర్శకుడు వశిష్ట్. తక్కువ బడ్జెట్‌లోనే భారీ విజువల్స్‌తో సినిమాను తెరకెక్కించిన విధానం ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీని సైతం మెస్మరైజ్ చేసింది.
అయితే ఈ సినిమాలో హీరోగా కళ్యాణ్ రామ్ కంటే ముందుగా మరో హీరోతో అనుకున్నారట. దర్శకుడు వశిష్ఠ ఈ సినిమా కథను ముందుగా ఓ స్టార్ హీరోకు చెప్పారని టాక్ వినిపిస్తోంది . ఆ హీరో ఎవరో కాదు మాస్ రాజా రవితేజ. కథను సిద్ధం చేసుకున్న తర్వాత రవితేజకు వివరించాడట వశిష్ఠ. అయితే రవితేజ ఈ సినిమాను సున్నితంగా తిరస్కరించారని.. ఇలాంటి కథలకు తాను సూట్ అవ్వనని ఈ మూవీని రిజక్ట్ చేశారని టాక్.
దాంతో ఇదే కథను కళ్యాణ్ రామ్ కు వినిపించగా ఆయన ఓకే చేయడమే కాకుండా.. తన ఓన్ బ్యానర్ అయినా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. అయితే నిజంగా రవితేజ ఈ సినిమాను రిజక్ట్ చేశారా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే అదే సమయంలో రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా రిలీజ్ అయ్యింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రవితేజ ధమాకా సినిమాతో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య తో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నాడు. అటు కళ్యాణ్ రామ్ డెవిల్ అనే సినిమాతో రాబోతున్నాడు. అలాగే బింబిసార 2 కూడా ప్లాన్ చేస్తున్నాడు.