Ravi Teja Khiladi: మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న సినిమా షూటింగ్ గురించి ఈ మధ్య రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుస్తున్న విషయం తెలిసిందే. ఖిలాడి అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. ఈ మయంలోనే ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా పట్టాలెక్కించాడు మాస్ రాజా. రామారావు ఆన్ డ్యూటీ అనే టైటిల్‌తో ఓ సినిమాను అనౌన్స్ చేశారు. దాంతో ఖిలాడి సినిమా షూటింగ్ ఆగిపోయిందని, ఇప్పట్లో ఈ సినిమా పూర్తవ్వదంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్స్‌కు తాజాగా చెక్ పెట్టింది ఖిలాడి చిత్రయూనిట్. ఈ మేరకు మూవీకి సంబంధించిన అప్డేట్‌ను ప్రకటించారు.
ఖిలాడి రవితేజ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నారు. మీనాక్షి చౌధరి – డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తుండగా.. యాక్షన్ హీరో అర్జున్ – అనసూయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌ను జులై 26నుంచి తిరిగి మొదలుపెట్టనున్నారు. ఈ అప్డేట్‌తోపాటు రవితేజ సూపర్ స్టైలిష్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటుగా ఓ సాంగ్ కూడా షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీశ్రీ సంగీతాన్ని అందిస్తోన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :