Ravi Teja: అలా చేసే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన మాస్ మహారాజా.. అసలు విషయం ఏంటంటే

ఇక ఈ సినిమా అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ్ డ్యూయల్ రోల్ లో కనిపించి అలరించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందించారు.

Ravi Teja: అలా చేసే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన మాస్ మహారాజా.. అసలు విషయం ఏంటంటే
Ravi Teja

Updated on: Dec 24, 2022 | 9:59 AM

మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రినాద్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ధమాకా మూవీ డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించి అలరించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందించారు. విడుదలకు ముందే ధమాకా పాటలు, టీజర్, ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగిగాయి ఇప్పుడు ఆ అంచనాలను రీచ్ అయ్యిందని తెలుస్తోంది. తాజాగా రవితేజ మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ధమాకా ప్రమోషన్స్ లో ఫ్యాన్స్ ను కలవడం గురించి రవితేజ మాట్లాడుతూ.. ఫ్యాన్స్ తో కలవడం జరుగుతూనే వుంటుంది. ఫ్యాన్ మీట్ ని చాలా ఎంజాయ్ చేశాను. అన్ని చోట్ల పాజిటివ్ గా వుంది. ఆ పాజిటివిటీనే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అని అన్నారు. మొదటి నుండి నేనింతే. మనం మాట్లాడకూడదు.. సినిమానే మాట్లాడుతుంది. సినిమా విడుదలైన తర్వాత ఆటోమేటిక్ గా సినిమానే మాట్లాడుతుంది అన్నారు.

ఇవి కూడా చదవండి

ధమాకా మంచి ఎంటర్ టైనర్. రాజా ది గ్రేట్ తర్వాత అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ చేయలేదు. ధమాకా ఫుల్ ఎంటర్ టైనర్. జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు. తెలుగు లో ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు మొదలుపెట్టింది చిరంజీవి గారు. తర్వాత మేమంతా ఫాలో అయ్యాం. ధమాకా, రౌడీ అల్లుడు లాంటి ఎంటర్ టైన్ మెంట్ సినిమానే. అందులో ఎలాంటి సందేహం లేదు. నాకు కొత్త రచయితలతో పని చేయడం ఇష్టం. వాళ్ళలో ఒక ఆకలి, తపన వుంటుంది. నేను అలా వచ్చినవాడినే..ఇక శ్రీలీల ఖచ్చితంగా పెద్ద స్టార్ అవుతుంది. అందం, ప్రతిభ రెండూ వున్నాయి. మంచి డ్యాన్సర్, వాయిస్, ఎనర్జీ అన్నీ వున్నాయి. పైగా తెలుగమ్మాయి. తప్పకుండా పెద్ద స్టార్ అవుతుంది. ఇక నాకు కథ నచ్చితే ఓకే చేస్తాను. ఇంకాస్త పక్కాగా చేసుకొని రమ్మంటాను. ముందు కథ నచ్చాలి. కథ నచ్చకుండా కాంబినేషన్ గురించి చేసే ప్రసక్తే లేదు. నేనే కాదు ఎవరూ కథ నచ్చకుండా చేయరు అని అన్నారు రవితేజ..