
మాస్ మాహారాజా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. దసరా కానుకగా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రవితేజ. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరోసారి తన హిట్ కాంబోను రిపీట్ చేయబోతున్నారు. టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్- మాస్ మహారాజా రవితేజ, మాస్ మేకర్ గోపీచంద్ మలినేని మరోసారి జతకట్టారు. గతంలోవ వీరిద్దరి కాంబోలో వచ్చిన డాన్ శీను, బలుపు క్రాక్ చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్స్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మ్యాసీ కాంబో- #RT4GM కోసం నాల్గవసారి కలిసి పని చేయనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీస్ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా.. పవర్ పుల్ కథతో రూపొందించనున్నారు. కొన్ని నెలల క్రితం పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే మరోసారి ఈ హిట్ కాంబో రిపీట్ కాబోతుండడంతో ఆ పోస్టర్ కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘బ్లాస్టింగ్ అప్‌డేట్‌ల కోసం సిద్ధంగా ఉండండి’ అంటూ మేకర్స్ మరోసారి అనౌన్స్ చేశారు. అంటే గురువారం మరిన్ని అప్డేట్స్ రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీలో వెర్సటైల్ యాక్టర్ సెల్వరాఘవన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇందులో అతని పాత్ర డిఫరెంట్ అండ్ మెమరబుల్ గా ఉండబోతుంది. ఈ సినిమాలో నటించే నటీనటుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు. రవితేజ ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని పాత్రలో నటించనున్నారు. ఇందులో కొంతమంది సర్ప్రైజింగ్ స్టార్ కాస్ట్, టెక్నికల్ టీం పని చేయనున్నట్లు తెలుస్తోంది.
Welcoming the Blockbuster musician to the MASSIEST COMBO 🔥🔥
Blockbuster music director @MusicThaman joins forces with MASS MAHARAJA @RaviTeja_offl and @megopichand to deliver chartbuster album for #RT4GM ❤️🔥❤️🔥
Stay tuned for more updates today!#RT4GMBlast 💥@selvaraghavan pic.twitter.com/r7h6ZUIaTx
— Mythri Movie Makers (@MythriOfficial) October 25, 2023
ఇదిలా ఉంటే.. దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదలైన టైగర్ నాగేశ్వర రావు సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మొదటి రోజు కంటే 5, 6 వ రోజు కలెక్షన్స్ పెరిగినట్లు తెలుస్తోంది. తెలుగులోనే కాకుండా హిందీ సహా కన్నడలోనూ మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బుక్ మై షోలో టైగర్ నాగేశ్వర రావు భారీ జంప్ ఈ సినిమాను రిజిస్టర్ చేయడం విశేషం.
#RT4GM 🤗
My 3rd with @MythriOfficial ❤️
4th with @megopichand 🔥It’s been a fantastic journey with them and this time looking forward to an absolute blast 💥 pic.twitter.com/4i0xwgXGLz
— Ravi Teja (@RaviTeja_offl) October 25, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.