AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Mohan: భార్యతో మనస్పర్థలు.. మళ్లీ ఆ సింగర్ తో కలిసి కనిపించిన స్టార్ హీరో.. ఆ రూమర్లు నిజమేనా?

ప్రముఖ కోలీవుడ్ నటుడు రవి మోహన్‌ ( గతంలో జయం రవి) తన భార్యతో విడిపోయాడు. అధికారికంగా విడాకులు తీసుకోకపోయినా మనస్పర్థలతో ఎవరి జీవితం వారు గడిపేస్తున్నారు. అయితే ఈ దంపతుల మధ్య గొడవలు రావడానికి ఒక ప్రముఖ సింగర్ కారణమని ప్రచారం జరిగింది.

Ravi Mohan: భార్యతో మనస్పర్థలు.. మళ్లీ ఆ సింగర్ తో కలిసి కనిపించిన స్టార్ హీరో.. ఆ రూమర్లు నిజమేనా?
Ravi Mohan
Basha Shek
|

Updated on: May 09, 2025 | 1:33 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ ఈ మధ్యన సినిమాలతో పాటు తన వ్యక్తిగత విషయాలతోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా తన కాపురం విషయంలో. 15 ఏళ్లుగా కలిసి కాపురం చేసిన భార్య ఆర్తితో విడాకులు కావాలంటున్నాడీ స్టార్ హీరో. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉంటున్నాడు. కాగా రవి మోహన్, ఆర్తి విడిపోవడానికి ప్రముఖ సింగర్‌ కెనిషా ఫ్రాన్సిసే కారణమని ప్రచారం జరిగింది.అయితే, అందులో ఎలాంటి నిజం లేదని తాము కేవలం స్నేహితులం మాత్రమే అంటూ ఇద్దరూ చెప్పుకొచ్చారు. అయితే తాజాగా వీరిద్దరూ ఒక పెళ్లి వేడుకలో జంటగా కనిపించి అందరికీ షాక్‌ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతన్నాయి. వీటిని చూసిన నెటిజన్లు గతంలో వీరి గురించి వచ్చిన వదంతులన్నీ నిజమే కావచ్చని అభిప్రాయపడుతున్నారు.

వేల్స్ విశ్వవిద్యాలయం ఛైర్మన్ ఇషారి కె. గణేష్ కుమార్తె పెళ్లి చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు కోలీవుడ్ సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సూపర్ స్టార్ రజనీకాంత్, రాధిక, కమల్ హాసన్, మణిరత్నం, సుహాసిని, సత్యరాజ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. అయితే రవి మోహన్ మాత్రం సింగర్‌ కెనిషా ఫ్రాన్సిస్‌ తో కలిసి ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యాడు. ఈ వేడుకలో ఇద్దరూ కలివిడిగా ఉండడమే కాకుండా కలిసి ఫొటోలు దిగారు. గతంలో తమ మధ్య ఏమీ లేదని చెప్పిన వారిద్దరూ ఇప్పుడు జంటగా పెళ్లిలో కనిపించడంతో అభిమానులు కూడా షాక్‌ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

కాగా ప్రముఖ ఎడిటర్‌ మోహన్‌ తనయుడే రవి మోహన్. చిరంజీవతో గాడ్ ఫాదర్ సినిమాను తీసిన దర్శకుడు మోహన్‌ రాజా ఆయన సోదరుడు. ఇక రవి మోహన్ బావ బావమరిది, పల్నాటి పౌరుషం తదితర చిత్రాల్లో బాల నటుడిగా నటించాడు. ఆ తర్వాత హీరోగానూ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు. ఇక రవిమోహన్ ప్రముఖ నిర్మాత త సుజాత విజయకుమార్‌ కూతురు ఆర్తిని 2009లో వివాహం పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఆరవ్‌, అయాన్‌ అని ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే 15 ఏళ్లపాటు కలిసి కాపురం చేసిన ఈ జంట.. గత ఏడాదిలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చారు.

ఫొటోస్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్