Asalu: పూర్ణ లీడ్ రోల్‌లో రవిబాబు ‘అసలు’.. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్.. ఎప్పుడు.. ఎక్కడంటే..?

రవిబాబు కథ అందించడంతో పాటు సినిమాలో కీ రోల్ చేశారు. ఆయనే ప్రొడ్యూస్ చేశారు. క్రైమ్ ఇన్వేస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఓ ప్రొఫెస‌ర్ మ‌ర్డ‌ర్ చుట్టూ ఈ సినిమా సాగిన‌ట్లుగా ట్రైల‌ర్‌ ద్వారా అర్థమవుతుంది.

Asalu: పూర్ణ లీడ్ రోల్‌లో రవిబాబు 'అసలు'.. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్.. ఎప్పుడు.. ఎక్కడంటే..?
Ravi Babu - Purna From Asalu Movie
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 06, 2023 | 7:12 PM

నటుడు, దర్శకుడు రవిబాబుకు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడిగా ఆయనకు మంచి సక్సెస్ రేట్ ఉంది. నరేష్‌కి తొలి సినిమా అల్లరి.. ఇచ్చి రాత్రికి రాత్రే అతడిని స్టార్‌ని చేసింది రవిబాబే. తక్కువ బడ్జెట్‌లో ఆసక్తికర కథలతో ఆయన సినిమాలు తీస్తుంటారు. త్వరలో రవిబాబు అసలు అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమాకు కేవలం కథ మాత్రమే ఇచ్చారు రవిబాబు. ఉద‌య్‌, సురేష్ సంయుక్తంగా థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం విడుదల కాబోతుంది. తొలుత సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని భావించారు. కానీ అదిరే ఆఫర్ రావడంతో.. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ చిత్రం ఏప్రిల్ 13వ తేదీన ETV విన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో విడుదల అవ్వనుంది. ఈ సినిమా డ్యూరేషన్ రెండు గంటలు అని తెలిసింది. ట్రైలర్, టీజర్లకు మంచి అప్లాజ్ వస్తుంది. ఈ చిత్రంలో పూర్ణ అలియాస్ షామా ఖాసిం ప్రధాన పాత్రలో నటించింది. రవిబాబు కూడా మరో లీడ్ చేశారు. గతంలో రవిబాబు పూర్ణ ప్రధాన పాత్రలో అవును, అవును 2 సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. మేకర్స్ ఈ చిత్రం లేటెస్ట్ పోస్టర్ కూడా విడుదల చేసారు. భూతద్దంలో నుంచి టెన్షన్‌తో చూస్తున్న ఆసక్తికర పూర్ణ ఫోటోను రిలీజ్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.