Raaka Movie: అల్లు అర్జున్ రాకా సినిమాలో క్రేజీ హీరోయిన్.. బన్నీతో మరోసారి జత కట్టనున్న టాలీవుడ్ బ్యూటీ..

పుష్ప 2 సెన్సేషన్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ రాకా. భారీ అంచనాల మధ్య రూపొందిస్తున్న ఈ మూవీ గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి నిత్యం ఏదోక వార్త సోషల్ మీడియాలో, ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా మరో క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్టింట వినిపిస్తుంది.

Raaka Movie: అల్లు అర్జున్ రాకా సినిమాలో క్రేజీ హీరోయిన్.. బన్నీతో మరోసారి జత కట్టనున్న టాలీవుడ్ బ్యూటీ..
Raaka Movie

Updated on: Jun 27, 2026 | 4:26 PM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ రాకా. పుష్ప 2 సంచలనం తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. కొన్ని నెలల క్రితమే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాగా.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణే నటిస్తున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. అయితే ఇప్పుడు ఇందులో మరో హీరోయిన్ కనిపించనున్నారనే టాక్ వినిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించనున్నారని టాక్ నడుస్తుంది. త్వరలోనే ముంబాయిలో ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్ లో రష్మిక జాయిన్ కానున్నారట. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్ప 1, పుష్ప 2 చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‏గా త్రిష.. వీడియోస్ ఇదిగో..

ఇదిలా ఉంటే.. రాకా చిత్రంలో బన్నీతోపాటు మృణాల్ ఠాకూర్, జాన్నీ కపూర్ సైతం కీలకపాత్రలలో కనిపించనున్నారని టాక్. వీరితోపాటు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సైతం ముఖ్య పాత్ర పోషిస్తున్నారట. అయితే ఈ విషయాలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఫిల్మ్ వర్గాలతోపాటు సోషల్ మీడియాలో ఈ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. త్వరలనే అల్లు అర్జున్, అట్లీ, దీపిక ఓ ఈవెంట్ కు హాజరవుతారని.. అందులో షారుఖ్ ఈసినిమాకు సంబంధఇంచిన కీలక అప్డేట్ పంచుకుంటారని తెలుస్తోంది.

ఎక్కువమంది చదివినవి : RRR Movie : అబ్బబ్బా.. ఏం మారింది భయ్యా.. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లీని చూశారా.. ? అచ్చం హీరోయిన్‏లాగే ఉందిగా..

ఈ చిత్రాన్ని దాదాపు 700 కోట్ల భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. ఈ ఏడాది చివరకు షూటింగ్ మొత్తం పూర్తి చేయలని చిత్రయూనిట్ భావిస్తుంది. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఉదయ్ కిరణ్‏తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్..

రష్మిక మందన్నా ఇన్ స్టా పోస్ట్..

ఎక్కువమంది చదివినవి : Cinema: 5 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ మూవీ.. ఓటీటీలో గత్తరలేపుతుంది..

Follow Us