
స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం ఈనెల 26న ఉదయ్ పూర్ లో జరగనుంది. ఇప్పటికే వీరి పెళ్లి పనులు మొదలయ్యాయి. చాలా కాలంగా ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కానీ వీరి లవ్ మ్యాటర్ ను చాలా వరకు గోప్యంగా ఉంచారు. అయితే వీరి పెళ్ళికి కొద్ది మంది అతిధులు మాత్రమే హాజరు కానున్నారు. విజయ్, రష్మిక వివాహంకు కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితల మధ్యనే జరగనుంది. ఆతర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ వేడుక జరగనుందని తెలుస్తుంది. ఇప్పటికే వీరి పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దాంతో ఈ ఇద్దరి పెళ్లి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే విజయ్, రష్మికతో ఉదయ్ పూర్ చేరుకున్నారు.
కొడవ, తెలుగు సంప్రదాయాల ప్రకారం విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం జరగనుంది. తెలుగు సంప్రదాయం ప్రకారం మాంగళ్య ధారణ జరగనుంది. కొడవ సంప్రదాయంలో పురోహితులకు ప్రాధాన్యత ఉండదు. పూర్వీకుల ఆశీస్సులే ప్రధానంగా కొడవ పెళ్లిళ్లు జరుగుతాయి. అలాగే ఒడి బియ్యం స్థానంలో వధువు కాసులు మూటగట్టుకొచ్చే పద్ధతి ఉంటుంది. అదేవిధంగా ప్రత్యేకమైన వస్త్రధారణ, వంటలు, వధువు తల్లికి ఉండే ప్రాధాన్యత కొడవ సంప్రదాయాన్ని ప్రత్యేకంగా చుపిస్తాయట. ఇలా విజయ్, రష్మిక పెళ్ళిలో చాలా వెరైటీస్ ఉండనున్నాయని తెలుస్తుంది.
కాగా నేడు (మంగళవారం) మెహందీ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఫిబ్రవరి 25న హల్దీ, సంగీత్ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ప్రైవేట్ కానీ రాయల్ ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లకు కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితులు హాజరవుతారు. అలాగే వీరి వివాహనికి వచ్చే వివాహానికి వచ్చే అతిథులను కొబ్బరి నీళ్లతో స్వాగతించనున్నారు. అలాగే ఈ పెళ్లి వేడుకలలో జపనీస్ వంటకాలను సైతం సిద్ధం చేయనున్నారట.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.