Rashmika Mandanna: ‘వాళ్లను చూడగానే కన్నీళ్లు వచ్చేశాయి’.. రష్మిక మందన్నా ట్వీట్ వైరల్..

|

Jul 16, 2023 | 6:33 AM

గుడ్ బై.. మిషన్ మజ్ను చిత్రాలతో నార్త్ ఆడియన్స్‏ను ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు యానిమల్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతుంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మరోవైపు భారీ అంచనాలు నెలకొన్న పుష్ప 2 సైతం చిత్రీకరణ జరుగుతుంది.

Rashmika Mandanna: వాళ్లను చూడగానే కన్నీళ్లు వచ్చేశాయి.. రష్మిక మందన్నా ట్వీట్ వైరల్..
Rashmika Mandanna
Follow us on

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది నేషనల్ క్రష్ రష్మిక. పుష్ప సినిమాతో ఒక్కసారిగా ఈ బ్యూటీ రేంజ్ మారిపోయింది. అప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ నుంచి ఆఫర్స్ క్యూ కట్టాయి. గుడ్ బై.. మిషన్ మజ్ను చిత్రాలతో నార్త్ ఆడియన్స్‏ను ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు యానిమల్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతుంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మరోవైపు భారీ అంచనాలు నెలకొన్న పుష్ప 2 సైతం చిత్రీకరణ జరుగుతుంది. ఈ క్రమంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉండే రష్మిక.. తాజాగా ఆసక్తికర ట్వీట్ చేసింది. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న బేబీ చిత్రం గురించి నేషనల్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.

“బేబీ సినిమా నాకు చాలా నచ్చింది. నటీనటులు అద్భుతంగా అద్భుతంగా నటించారు. ఈ సినిమా చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయి. ఈ మూవీలోని సీన్స్ నా మదిలో చాలాకాలం నిలిచిపోతాయి ” అంటూ ట్వీట్ చేశారు. అలాగే చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. అయితే బేబీ సినిమాను ప్రీమియర్ షో చూసిన రష్మిక థియేటర్ బయటకు వచ్చే సమయంలో ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వం వహించిన బేబీ చిత్రం జూలై 14న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇందులో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ప్రతి ఒక్కరి మనసును కదిలించేలా ఈ చిత్రంలోని సన్నివేశాలు ఉన్నాయని.. అందరికి తమ మొదటి ప్రేమను గుర్తుచేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.