Rashmika Mandanna: సైలెంట్ అయిన రష్మిక.. శ్రీవల్లిని బాగా మిస్ అవుతున్న ఫ్యాన్స్..

| Edited By: Rajitha Chanti

Jul 09, 2023 | 7:42 AM

నేషనల్ క్రష్‌గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వటంతో బాలీవుడ్ జనాలు కూడా ఈ కన్నడ బ్యూటీ మీద సీరియస్‌గా కాన్సన్‌ట్రేట్ చేశారు. పుష్ప రిలీజ్ తరువాత నేషనల్ లెవల్‌లో హాట్ టాపిక్ అయ్యారు రష్మిక. అదే సమయంలో వరుసగా బాలీవుడ్ ఆఫర్స్ కూడా రావటంతో నార్త్ మీడియా కూడా వాట్‌ ఏ బ్యూటీ అంటూ రష్మికను ఆకాశానికెత్తేసింది. కానీ ఇప్పుడు ఆ జోష్ కనిపించటం లేదు.

Rashmika Mandanna: సైలెంట్ అయిన రష్మిక.. శ్రీవల్లిని బాగా మిస్ అవుతున్న ఫ్యాన్స్..
Rashmika Mandanna
Follow us on

నిన్న మొన్నటి వరకు న్యూస్‌ హెడ్‌లైన్స్‌లో రెగ్యులర్‌గా కనిపించిన రష్మిక మందన్న ఈ మధ్య మరీ నల్లపూసైపోయారు. భారీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నా.. మీడియాలో అమ్మడి పేరు అస్సలు వినిపించటం లేదు. శ్రీవల్లి కావాలనే సైలెంట్ అయ్యారా…? లేకపోతే మీడియానే ఈ బ్యూటీని లైట్ తీసుకుందా? అనేది తెలియాలి. రష్మిక మందన్న… స్టార్ హీరోయిన్‌గా సెటిల్ అవ్వకముందే ఈ పేరు నేషనల్‌ లెవల్‌లో సెన్సేషన్‌ అయ్యింది. నేషనల్ క్రష్‌గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వటంతో బాలీవుడ్ జనాలు కూడా ఈ కన్నడ బ్యూటీ మీద సీరియస్‌గా కాన్సన్‌ట్రేట్ చేశారు. పుష్ప రిలీజ్ తరువాత నేషనల్ లెవల్‌లో హాట్ టాపిక్ అయ్యారు రష్మిక. అదే సమయంలో వరుసగా బాలీవుడ్ ఆఫర్స్ కూడా రావటంతో నార్త్ మీడియా కూడా వాట్‌ ఏ బ్యూటీ అంటూ రష్మికను ఆకాశానికెత్తేసింది. కానీ ఇప్పుడు ఆ జోష్ కనిపించటం లేదు.

ప్రజెంట్ యానిమల్, పుష్ప 2 వర్క్‌లో బిజీగా ఉన్నారు రష్మిక. ఈ సినిమాల ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ కాకపోవటంతో రష్మిక పేరు కూడా న్యూస్‌లో కనిపించటం లేదు. దీనికి తోడు అమ్మడు సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్‌గా లేకపోవటంతో అసలు ట్రెండ్‌లోకే రావటం లేదు. పుష్ప 2 రిలీజ్ ఇప్పట్లో ఉండే ఛాన్సే లేదు. ఆగస్టులో రిలీజ్ కావాల్సిన యానిమల్‌ కూడా వాయిదా పడటంతో మరికొద్ది రోజుల పాటు రష్మిక మీడియాలో కనిపించే అవకాశం లేకుండా పోయింది. దీంతో సిల్వర్‌ స్క్రీన్‌ శ్రీవల్లిని బాగా మిస్ అవుతున్నారు ఫ్యాన్స్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.