Telugu Cinema: వరుస హిట్లతో జోరు మీదున్న హీరోయిన్.. కొత్త సినిమా ప్రకటించిన బ్యూటీ.. ఎవరంటే..

ఇప్పుడు పాన్ ఇండియా క్రేజీ హీరోయిన్. బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో ఫుల్ జోష్ మీద దూసుకుపోతుంది. తెలుగు, హిందీ భాషలలో స్టార్ హీరోయిన్లకే గుబులు పుట్టిస్తోంది. ఇటీవలే కొత్త సినిమాతో విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు కొత్త సినిమా ప్రకటించింది.. ఇంతకీ ఈ బ్యూటీని గుర్తుపట్టారా..? సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉన్న బ్యూటీ ఆమె.

Telugu Cinema: వరుస హిట్లతో జోరు మీదున్న హీరోయిన్.. కొత్త సినిమా ప్రకటించిన బ్యూటీ.. ఎవరంటే..
Rashmika

Updated on: Jun 26, 2025 | 11:32 AM

ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్‏గా క్రేజ్ అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఒక్కో సినిమాకు అత్యధిక పారితోషికం తీసుకుంటూ ఫుల్ ఫాంలో దూసుకుపోతుంది. భాషతో సంబంధమే లేకుండా వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు స్టార్ హీరోల కంటే ఎక్కువగా బిజీగా ఉన్న హీరోయిన్ ఆమె. గత రెండేళ్లల్లో ఆమె నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ఇక ఇప్పుడు తాజాగా మరో కొత్త సినిమా అనౌన్స్ చేసింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? తనే హీరోయిన్ రష్మిక మందన్నా. పుష్ప 2, ఛావా, యానిమల్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు అందుకుంది. ఇక ఇటీవలే కుబేర చిత్రంతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంది.

తాజాగా రష్మిక మరో ప్రయోగాత్మక సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. అన్ ఫార్ములా ఫిలిమ్స్ బ్యానర్ పై వస్తున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా రష్మిక అన్ లీష్ట్ అనే ట్యాగ్ తో కొత్త పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం రిలీజ్ చేసిన ఈసినిమా పోస్టర్ ఆసక్తిని కలిగిస్తోంది. పొదల మధ్యలో అగ్నితో తగలబడ్డ చెట్టు ఒడిలో నిఖార్సైన యాక్షన్ లుక్ లో చేతిలో ఒక ఆయుధం పట్టుకుని నిలబడి కనిపిస్తుంది రష్మిక. ఆమె వెనుక జనం టార్చ్ లతో వెంబడిస్తున్న దృశ్యం ఉన్న పోస్టర్ లో “హంటెడ్.. వుండెడ్.. అన్ బ్రోకెన్..”అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ మూవీ అని అర్థమవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇక ఇదే పోస్టర్ ను రష్మిక షేర్ చేస్తూ.. “ఇంతవరకూ నన్ను మీరు చూసింది ఒక ముద్దుగా నవ్వే అమ్మాయిగా మాత్రమే. కానీ ఈసారి నేను చూపించబోయే రష్మిక పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నేను ఎంతో కష్టపడి చేసిన పాత్ర ఇది. టైటిల్ గెస్ చేస్తే కచ్చితంగా కలుస్తాను” అంటూ రాసుకొచ్చింది. శుక్రవారం ఉదయం 10.08కి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు, సాంకేతిక టీమ్ వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రష్మిక కొత్త సినిమాపై ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి : 

Telugu Cinema: టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్‏తో రచ్చ చేస్తుంది.. ఈ క్యూటీ ఎవరంటే..

చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా ఒక్కో సినిమాకు రూ.11 కోట్లు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్..

Nuvvostanante Nenoddantana: ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్.. మహిళలకు రోల్ మోడల్‏.. ఇప్పుడేం చేస్తుందంటే..

Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..