
కింగ్ డమ్ మూవీ థియేటర్స్ లో దుమ్మురేపుతుంది. చాలా కాలం తర్వాత విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ కొట్టాడు. అన్ని ఏరియాల నుంచి సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. థియేట్సర్ దగ్గర విజయ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. మళ్ళీరావా, జెర్సీలాంటి క్లాసిక్ సినిమాలు తెరకెక్కించిన గౌతమ్ తన స్టైల్ మార్చి యాక్షన్ ఎంటర్టైనర్‌గా కింగ్‌డమ్ ను తెరకెక్కించాడు. నేడు (జులై 31న) విడుదలైన కింగ్‌డమ్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా చూసిన ప్రేక్షకులు సినిమా బ్లాక్ బస్టర్ కొట్టేశాం అని అంటున్నారు.
ప్రేక్షకులు మాత్రమే కాదు సినీ సెలబ్రెటీలు కూడా కింగ్ డమ్ సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కింగ్ డమ్ సినిమా పై ప్రశంసలు కురిపించారు. అలాగే మాజీ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు కూడా కింగ్ డమ్ సినిమా పై చూసి తన రివ్యూ ఇచ్చాడు. తాజాగా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా కింగ్ డమ్ సినిమా పై ప్రశంసలు కురిపించింది.
సోషల్ మీడియా వేదికగా రష్మిక స్పందిస్తూ.. ఈ సక్సెస్ నీకు, నిన్ను ప్రేమించే వారికి ఎంత అర్ధమవుతుందో నాకు తెలుసు విజయ్ దేవరకొండ. మనం మనం కొట్టినమ్ అంటూ ఎక్స్ ( ట్విట్టర్) లో రాసుకొచ్చింది రష్మిక. దానికి విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. మనం కొట్టినమ్ అని రిప్లే ఇచ్చాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
I know how much this means to you and all those who love you 🥹❤️@TheDeverakonda !!
“MANAM KOTTINAM”🔥#Kingdom
— Rashmika Mandanna (@iamRashmika) July 31, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.