Rashmika Mandanna: మకాం మారుస్తున్న నేషనల్ క్రష్.. రష్మిక ముంబైకి షిఫ్ట్ అవ్వనుందా..?

ఇప్పటికే చాలా మంది ఇలా తమ లొకేషన్ ను మార్చుకున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మరో బ్యూటీ కూడా చేరనుందని తెలుస్తోంది. టాలీవుడ్ లో చాలా మంది బ్యూటీలు బాలీవుడ్ కు చెక్కేసి అక్కడ సినిమాలు చేశారు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా ఇప్పుడు బాలీవుడ్ కు మకాం మారుస్తుందని టాక్ వినిపిస్తుంది.

Rashmika Mandanna: మకాం మారుస్తున్న నేషనల్ క్రష్.. రష్మిక ముంబైకి షిఫ్ట్ అవ్వనుందా..?
Rashmika Mandanna

Updated on: Dec 06, 2023 | 12:54 PM

చాలా మంది భామలు తమ సొంత భాషల్లోనే కాదు ఇతర భాషల్లో రాణిస్తూ ఉంటారు. కొంతమంది తమ సొంత భాషల్లో సినిమాలు తగ్గించి ఇతరభాషల్లో స్థిరపడుతుంటారు. ఇప్పటికే చాలా మంది ఇలా తమ లొకేషన్ ను మార్చుకున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మరో బ్యూటీ కూడా చేరనుందని తెలుస్తోంది. టాలీవుడ్ లో చాలా మంది బ్యూటీలు బాలీవుడ్ కు చెక్కేసి అక్కడ సినిమాలు చేశారు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా ఇప్పుడు బాలీవుడ్ కు మకాం మారుస్తుందని టాక్ వినిపిస్తుంది. యానిమల్ తో వచ్చిన క్రేజ్ తో అక్కడ ఈ చిన్నదానికి వరుస ఆఫర్స్ వస్తున్నాయట. అందుకే బాలీవుడ్ లో స్థిరపడాలని చూస్తుందట.

టాలీవుడ్ లో ఛలో సినిమాతో హీరోయిన్ గా కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్న. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది ఈ భామ. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుసగా గీతగోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు లాంటి హిట్స్ ను అందుకుంది. అలాగే తమిళ్ లోనూ సినిమాలు చేసింది. ఈ చిన్నది. కార్తీ సరసన ఓ సినిమా చేసింది. అలాగే దళపతి విజయ్ నటించిన వారసుడు సినిమాలో హీరోయిన్ గా చేసింది.

అలాగే బాలీవుడ్ లోనూ ఈ బ్యూటీ క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి గుడ్‌బై అనే సినిమా చేసింది. ఆతర్వాత సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన మిస్టర్ మజ్ను లాంటి సినిమాలు చేసింది. ఇక రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యానిమల్ సినిమాలో నటించింది. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా భారీ విజయం సొంతం చేసుకుంది. యానిమల్ సినిమా భారీ విజయం సాధించడంతో పాటు రష్మిక రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. దాంతో ఈ చిన్నదానికి బాలీవుడ్ లో ఆఫర్స్ క్యూ కట్టాయని తెలుస్తోంది. దాంతో ఇప్పుడు రష్మిక హైదరాబాద్ నుంచి ముంబైకు షిఫ్ట్ కానుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్ లో ఆఫర్స్ వస్తుండటంతో ముంబైకి షిఫ్ట్ అవ్వాలని చూస్తుందట. ఈ మేరకు రష్మిక మందన్న పీఆర్ టీమ్ ప్లాన్ చేస్తుందట. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.