Rashmika Mandanna: ఆయన చాలా డిఫరెంట్.. సందీప్ రెడ్డి పై రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రీసెంట్ గా ఈ చిన్నది యానిమల్ సినిమాతో భారీ హిట్ అందుకుంది'. రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన 'యానిమల్' చిత్రం గతేడాది విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. అలాగే కొన్ని విమర్శలు కూడా ఎదుర్కున్నాడు.సినిమా పై కొందరు విమర్శలు చేశారు.

Rashmika Mandanna: ఆయన చాలా డిఫరెంట్.. సందీప్ రెడ్డి పై రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rashmika Mandanna

Updated on: Jan 19, 2024 | 3:14 PM

ప్రస్తుతం సెన్సేషనల్ స్టార్ గా దూసుకుపోతోంది రష్మిక మందన్న. బడాహీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటూ టాక్ హీరోయిన్ గా రాణిస్తుంది. రీసెంట్ గా ఈ చిన్నది యానిమల్ సినిమాతో భారీ హిట్ అందుకుంది’. రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘యానిమల్’ చిత్రం గతేడాది విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. అలాగే కొన్ని విమర్శలు కూడా ఎదుర్కున్నాడు.సినిమా పై కొందరు విమర్శలు చేశారు. తాజాగా రష్మిక మందన్న మాత్రం సందీప్ రెడ్డిని తెగ పొగిడేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది.

సందీప్ రెడ్డి వంగ అందరిలా కాదు భిన్నంగా పనిచేస్తాడు. యానిమల్ సినిమా చూశాక నాకు అలాంటి సినిమానే కావాలని ఫీలయ్యాను. ‘యానిమల్ పార్క్’ కథ మనలో ఎవరిదైనా కావచ్చు. ఆయన చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సినిమాకి సంబంధించిన ఓ చిన్న కథను చెప్పాడు. యానిమల్ పార్క్ ద్వారా పెద్ద విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నా’ అని రష్మిక చెప్పుకొచ్చింది.

సందీప్ ఒక కథ చేస్తే దానికే కమిట్ అవుతాడు. ఆడియన్స్‌కు ఏం కావాలో సందీప్ కు తెలుసు. ఆయన ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను’ అని రష్మిక తెలిపింది. రష్మిక మందన్నక్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందుకున్న ఈ అమ్మడు. ఇప్పుడు మరికొన్ని సూపర్ హిట్ సినిమాల్లోనూ నటిస్తుంది. ప్రస్తుతం ‘పుష్ప 2’, ‘రెయిన్‌బో’, గర్ల్ ఫ్రెండ్ సినిమాల్లో నటిస్తుంది. ‘యానిమల్’ సినిమాతో విజయం సాధించడంతో బాలీవుడ్ నుంచి బోలెడన్ని ఆఫర్లు వస్తున్నాయి ఈ చిన్నదానికి.

రష్మిక మందన్న ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి