
రష్మిక మందన్న తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ చిత్ర పరిశ్రమలలో బాగా పాపులర్. తన కెరీర్ లో ఎక్కుగా స్టార్ హీరోలతోనే స్క్రీన్ షేర్ చేసుకుంది. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, కార్తీ, విజయ్, ధనుష్, సిద్ధార్థ్ మల్హోత్రా, అమితాబ్ బచ్చన్, విక్కీ కౌశల్, రణ్‌బీర్ కపూర్, సల్మాన్ ఖాన్, రక్షిత్ శెట్టి, పునీత్ రాజ్‌కుమార్, దర్శన్, ధృవ సర్జా తదితర ప్రముఖ నటులతో రష్మిక నటించింది. రష్మిక తొలి సినిమా కన్నడ సినిమా ‘కిరిక్ పార్టీ’. ఈ చిత్రంలో ఆమె కన్నడ స్టార్ రక్షిత్ శెట్టితో కలిసి స్క్రీన్ పంచుకుంది. ఆ తర్వాత పునీత్ రాజ్ కుమార్ తో కలిసి ‘అంజని పుత్ర’ సినిమాలో నటించింది. అలాగే గోల్డెన్ స్టార్ గణేష్ తో కలిసి ‘చమక్’ సినిమాలో యాక్ట్ చేసింది. దర్శన్ తో కలిసి ‘యజమాన’ , ధ్రువ సర్జాతో కలిసి ‘పొగరు’ సినిమాల్లో ను నటించి హిట్స్ సొంతం చేసుకుంది.
టాలీవుడ్ లో..
‘గీత గోవిందం’ సినిమాలో విజయ్ దేవరకొండతో కలిసి నటించింది. ఈ సినిమా రష్మిక కెరీర్‌నే మార్చేసింది అని చెప్పడంలో తప్పు లేదు. ఇది రష్మికకు తెలుగులో మరింత పాపులారిటీని ఇచ్చింది.ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మహేష్ సరసన రష్మిక నటించింది. అల్లు అర్జున్ తో కలిసి ‘పుష్ప’, ‘పుష్ప 2’ చిత్రాల్లో నటించి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంది. న్యాచురల్ స్టార్ నాని, నాగార్జునలతో కలిసి దేవదాసులో యాక్ట్ చేసింది.
తమిళంలో..
ఇక తమిళంలో కార్తీతో కలిసి ‘సుల్తాన్’ సినిమా చేసింది రష్మిక. అలాగే వారసుడు సినిమాలో విజయ్ తో కలిసి దళపతి తో కలిసి నటించింది. ఇప్పుడు ధనుష్ తో కలిసి ‘కుబేర’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోనుంది.
బాలీవుడ్ లో..
ఇక హిందీలో ‘మిషన్ మజ్ను’ సినిమా చేసింది రష్మిక. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించాడు. అమితాబ్ బచ్చన్ నటించిన ‘గుడ్‌బై’ చిత్రంలోనూ రష్మిక మెయిన్ లీడ్ పోషించింది. అలాగే విక్కీ కౌశల్ తో కలిసి ‘ఛావా’ సినిమాలో, రణబీర్ కపూర్ తో కలిసి ‘యానిమల్’ సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్స్ కొట్టింది. ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ ‘సికందర్’ సినిమాలోనూ రష్మిక నటించింది. అయితే, ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేకపోయింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..