AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Deverakonda: విజయ్ దేవరకొండకు బర్త్ డే విషెస్ చెప్పని రష్మిక.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే

ఇటీవల ఆయన చేసిన ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. చివరిగా వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా మీదా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఇదిలా ఉంటే ఈ గురువారం (మే 9) విజయ్ దేవరకొండ పుట్టినరోజు జరుపుకున్నారు.

Vijay Deverakonda: విజయ్ దేవరకొండకు బర్త్ డే విషెస్ చెప్పని రష్మిక.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే
Vijay Devarakonda, Rashmika
Rajeev Rayala
|

Updated on: May 10, 2024 | 10:29 AM

Share

విజయ్ దేవరకొండ ప్రస్తుత సాలిడ్ హిట్ కోసం కష్టపడుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా.. మంచి హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఇటీవల ఆయన చేసిన ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. చివరిగా వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా మీదా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఇదిలా ఉంటే ఈ గురువారం (మే 9) విజయ్ దేవరకొండ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భముగా అభిమానులు, సినీ సెలబ్రెటీలు పెద్దెత్తున సోషల్ మీడియాలో విషెస్ తెలిపారు. అయితే రష్మిక మందన్న సోషల్ మీడియాలో విజయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించారు. ఈ కాంబినేషన్ ప్రేక్షకులకు నచ్చింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆతర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరు చట్టపట్టాలేసుకు తిరుగుతున్నారని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయంపై ఇద్దరూ పెదవి విప్పలేదు.

ఇప్పుడు రష్మిక మందన్న విజయ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతేడాది రష్మిక ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ ద్వారా విజయ్ దేవరకొండకు శుభాకాంక్షలు తెలియజేసింది. ఈసారి ఎలాంటి స్టేటస్ కూడా పెట్టలేదు. ఎందుకు అనే ప్రశ్న తలెత్తుతుంది.ఇటీవల రష్మిక-విజయ్‌ ఇష్యూ చాలా చర్చనీయాంశమైంది. వీరికి నిశ్చితార్థం కూడా జరుగుతుందని టాక్ వినిపించింది.  వీటన్నింటి నుంచి విజయ్ తప్పించుకోవడానికే రష్మిక విష్ చేయలేదని కొందరు అంటున్నారు. రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఇద్దరూ విదేశాలకు వెళ్లారు. అక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారని కూడా వార్తలు వచ్చాయి.

రష్మిక మందన్న ఇన్ స్టా

విజయ్ దేవరకొండ ఇన్ స్టా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రిజెక్ట్ అయిన ప్రతిసారి ఈ ఒక్క పని చేయండి.. పూరి చెప్పిన సత్యాలు.
రిజెక్ట్ అయిన ప్రతిసారి ఈ ఒక్క పని చేయండి.. పూరి చెప్పిన సత్యాలు.
రైతుకు పొలంలోని గడ్డిలో కనిపించిన గూడు.. లోపల చూడగా..
రైతుకు పొలంలోని గడ్డిలో కనిపించిన గూడు.. లోపల చూడగా..
భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ
భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ
ఆసుపత్రి నుంచి ఒక్కసారిగా పరుగులు తీసిన పేషంట్లు.. ఏం జరిగిందంటే
ఆసుపత్రి నుంచి ఒక్కసారిగా పరుగులు తీసిన పేషంట్లు.. ఏం జరిగిందంటే
డబ్బుల సంచులు తెస్తున్న బుధుడు.. మీ రాశి లక్కీ లిస్టులో ఉందా?
డబ్బుల సంచులు తెస్తున్న బుధుడు.. మీ రాశి లక్కీ లిస్టులో ఉందా?
ఈ కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఎందులో పెట్టుబడి పెడితే మంచిది..?
ఈ కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఎందులో పెట్టుబడి పెడితే మంచిది..?
వేసవిలో చల్లగా ఫ్రీజ్‌ వాటర్‌ తాగే వారికి అలర్ట్‌.. సంగతేమంటే?
వేసవిలో చల్లగా ఫ్రీజ్‌ వాటర్‌ తాగే వారికి అలర్ట్‌.. సంగతేమంటే?
ఏసీ ఇన్‌స్టాల్ చేస్తున్నారా? ఈ చిన్న తప్పు చేశారంటే..భారీ ప్రమాదం
ఏసీ ఇన్‌స్టాల్ చేస్తున్నారా? ఈ చిన్న తప్పు చేశారంటే..భారీ ప్రమాదం
హ్యాట్రిక్‌ ట్రోఫీపై కన్నేసిన టీమిండియా.. కెప్టెన్‌గా ఎవరంటే?
హ్యాట్రిక్‌ ట్రోఫీపై కన్నేసిన టీమిండియా.. కెప్టెన్‌గా ఎవరంటే?
ఇదేం సినిమా రా బాబు.. అప్పుడు అట్టర్ ప్లాప్.. ఇప్పుడు సూపర్ హిట్.
ఇదేం సినిమా రా బాబు.. అప్పుడు అట్టర్ ప్లాప్.. ఇప్పుడు సూపర్ హిట్.