ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది రాశీ ఖన్నా. తొలి చిత్రంతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంది. అందం, అభినయం ఎంత ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు స్టార్ హీరోస్ సరసన మాత్రం ఛాన్స్ అందుకోలేకపోయింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం రాశీ ఖన్నా హిందీ సినిమాలతో బిజీగా ఉంది.. ప్రస్తుతం ఆమె సుందర్ సీ దర్శకత్వంలో రూపొందుతున్న అరణ్మణై.. 4 చిత్రంలో నటిస్తుంది. అందం అభినయం ఉన్న ఈ చిన్నదనికి అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయి . సాలిడ్ సక్సెస్ లేకపోయినా ఈ చిన్నదాని కి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి.
ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం గ్లామరస్ ఫొటోలతో ఆకట్టుకుంటుంది ఈ భామ. తాజాగా రాశిఖన్నా షేర్ చేసిన ఫోటోలు కుర్రకారుకు కిర్రెక్కిస్తున్నాయి. రోజు రోజుకు అందం పెంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ భామ.
రీసెంట్ గా మిర్రర్ ఫోటోను షేర్ చేసింది ఈ వయ్యారి భామ.. అందాలు వడ్డిస్తూ.. కుర్రకారును కవ్విస్తోంది ఈ చిన్నది. రాశి ఖన్నా ఎంతలా అందాలు ఆరబోసిన ఆశించిన స్థాయిలో బడా హీరోల సినిమాల్లో ఛాన్స్ లు రావడం లేదు. ఎన్టీఆర్ తప్ప ఇప్పటివరకు రాశి పెద్ద హీరోల సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు ఈ రేంజ్ లో వయ్యారాలు ఒలకబోస్తున్న రాశికి ముందు ముందు పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం ఖాయం అంటున్నారు ఆమె ఫ్యాన్స్.