Singer Noyal Sean: ప్రముఖ సింగర్‌ నోయెల్‌ ఇంట విషాదం.. అనారోగ్యంతో కన్నుమూసిన తండ్రి.. ప్రముఖుల సంతాపం

ప్రముఖ ర్యాప్‌ సింగర్‌, నటుడు, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ నోయెల్‌ (Noyal Sean )ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి శామ్యూల్‌ కన్నుమూశారు. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శామ్యూల్ కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న..

Singer Noyal Sean: ప్రముఖ సింగర్‌ నోయెల్‌ ఇంట విషాదం.. అనారోగ్యంతో కన్నుమూసిన తండ్రి.. ప్రముఖుల సంతాపం
Singer Noyal Sean
Follow us
Basha Shek

|

Updated on: Jul 18, 2022 | 1:50 PM

ప్రముఖ ర్యాప్‌ సింగర్‌, నటుడు, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ నోయెల్‌ (Noyal Sean )ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి శామ్యూల్‌ కన్నుమూశారు. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శామ్యూల్ కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ తదితర ప్రముఖులు నోయెల్‌కు సంతాపం తెలియజేశారు. కాగా ర్యాప్‌ సింగర్‌గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నోయెల్‌ నటుడిగా, యాంకర్‌గానూ సత్తా చాటాడు. పలు హిట్‌ సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించి మెప్పించాడు. ముఖ్యంగా ఈగ, కుమారి 21 F, నాన్నకు ప్రేమతో, ప్రేమమ్‌, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌, రంగస్థలం, హలో గురూ ప్రేమకోసమే, పడిపడిలేచే మనసు తదితర సినిమాల్లో నోయెల్‌ పోషించిన పాత్రలకు మంచి పేరొచ్చింది.

అటు వెండితెరపై మెరుస్తూనే బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు నోయెల్‌. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-4లో కంటెస్టెంట్‌గానూ పాల్గొని అందరినీ ఆకట్టుకున్నాడు. కాగా 2019 నవంబర్‌లో నటి ఎస్తేర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు నోయెల్‌. అయితే ఈ వైవాహిక బంధం ఎక్కువ కాలం నిలవలేదు. వ్యక్తిగత కారణాలతో పెళ్లైన కొద్ది నెలలకే విడాకులు తీసుకుని విడిపోయారు. కాగా నోయెల్‌ తన తండ్రితో ఎంతో అనుబంధం ఉంది. వాళ్లిద్దరూ ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారట. తన తండ్రితో సరదాగా గడిపిన క్షణాలను వీడియోల రూపంలో నోయెల్‌ షేర్‌ చేస్తుంటారు. ఇప్పుడు ఆయన కన్నుమూయడంతో సింగర్‌ తీవ్ర ఆవేదనకు లోనైనట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..