AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiran Abbavaram: ప్రశ్నించేవాళ్లకు ఒక్కటే సమాధానం .. ఎమోషనల్ పోస్ట్ చేసిన కిరణ్ అబ్బవరం..

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ థాంక్యూ. షార్ట్ ఫిల్మ్స్, ఫీచర్ ఫిల్మ్స్, నా తదుపరి చిత్రాలు.. ఇలా జీవితంలోని ప్రతిదశలో అండగా నిలిచిన వారందరికీ

Kiran Abbavaram: ప్రశ్నించేవాళ్లకు ఒక్కటే సమాధానం .. ఎమోషనల్ పోస్ట్ చేసిన కిరణ్ అబ్బవరం..
Kiran Abbavaram
Rajitha Chanti
|

Updated on: Jul 18, 2022 | 1:16 PM

Share

రాజావారు రాణివారు సినిమాతో చిత్రపరిశ్రమలోకి కథానాయకుడిగా అరంగేట్రం చేశారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత వచ్చిన ఎస్ఆర్ కళ్యాణమండపం మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇటీవల ఈ యంగ్ హీరో నటించిన సెబాస్టియన్, సమ్మతమే చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. కానీ కిరణ్ అబ్బవరం క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైనప్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ యంగ్ హీరో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. నేను మీకు బాగా కావాల్సినవాడిని, వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో తాజాగా తన ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేసుకున్నారు. జూలై 15న తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కిరణ్ అబ్బవరం.

” పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ థాంక్యూ. షార్ట్ ఫిల్మ్స్, ఫీచర్ ఫిల్మ్స్, నా తదుపరి చిత్రాలు.. ఇలా జీవితంలోని ప్రతిదశలో అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. నా ఎదుగుదలకు సపోర్టే ఇంధనం. దానికి థ్యాంక్స్ మాత్రమే సరిపోదు. మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేసేందుకు ఇంకా కష్టపడి పనిచేస్తానని మాటిస్తున్నాను. ఇన్ని సినిమాలు ఎలా వస్తున్నాయి ? బ్యాగ్రౌండ్ ఏంటీ ? గట్టి సపోర్ట్ ఉందేమో ? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ నా సమాధానం ఒక్కటే హార్ట్ వర్క్. క్లాసులో మనకు తక్కువ మార్కులు వచ్చాయన్న దానికంటే పక్కవాడికి ఎక్కువ మార్కులు ఎలా వచ్చాయనే బాధ, నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. అలాంటి నెగిటివిటీ నాపై వస్తోంది. అంటే జీవితంలో నేనేదో పాజిటివ్ గా సాధించానని అర్థం. ఈ పని కోసమే ఎన్నో ఏళ్లు తిరిగాను. నేను కోరుకున్న పని నాకు వచ్చినప్పుడు దాన్ని ఇష్టపడి చేస్తున్నా ” అంటూ కిరణ్ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.