Dhurandhar: టీవీలో ‘ధురంధర్’.. ఒకే టైమ్‌లో ఏకంగా మూడు ఛానెల్స్‌లో బ్లాక్ బస్టర్ మూవీ.. పూర్తి వివరాలివే

థియేటర్లలో, ఓటీటీలో సంచలనం సృష్టించిన 'ధురందర్' సినిమా ఇప్పుడు టీవీలోకి రానుంది. దీనికి సంబంధించిన తేదీ కూడా ఖరారైంది. థియేటర్లలో, ఓటీటీలో ఈ బ్లాక్ బస్టర్ సినిమాను చూడలేకపోయిన ప్రేక్షకులు, ఇప్పుడు ఇంట్లోనే టీవీలో ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయవచ్చు.

Dhurandhar: టీవీలో ధురంధర్.. ఒకే టైమ్‌లో ఏకంగా మూడు ఛానెల్స్‌లో బ్లాక్ బస్టర్ మూవీ.. పూర్తి వివరాలివే
Dhurandhar Movie

Updated on: May 28, 2026 | 7:01 AM

స్టార్ హీరో రణ్ వీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీలో సారా అర్జున్ హీరోయిన్ గా నటించింది. మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, రాకేష్ బేడీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా 2025 డిసెంబర్ లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. 1300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఆ తర్వాత ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొట్టింది. ఇప్పుడీ సినిమా సీక్వెల్ ధురంధర్ ది రివేంజ్ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. అయితే ధురంధర్ ఫస్ట్ పార్ట్ ఇప్పుడు బుల్లితెరపై సందడి చేయనుంది. ఈ చిత్రం మే 30, శనివారం సాయంత్రం 7 గంటలకు మూడు ఛానెళ్లలో ఏకకాలంలో ప్రసారం కానుంది. ధురంధర్ టీవీ ప్రీమియర్ స్టార్ గోల్డ్, స్టార్ గోల్డ్ 2 మరియు కలర్స్ సినీప్లెక్స్ ఛానెళ్లలో టెలికాస్ట్ కానుంది. ఈ విషయాన్ని సదరు టీవీ ఛానెల్స్ అధికారికంగా ప్రకటించాయి.

ధురంధర్ సినిమా టీవీ ప్రీమియర్ గురించి దర్శకుడు ఆదిత్య ధర్ మాట్లాడుతూ, “ఈ సినిమా పట్ల ప్రేక్షకులు చూపిస్తున్న అపారమైన ప్రేమకు, ఈ ఫ్రాంచైజీకి లభిస్తున్న అద్భుతమైన స్పందనకు మేము నిజంగా కృతజ్ఞులం. , మే 30వ తేదీన సాయంత్రం 7 గంటలకు స్టార్ గోల్డ్, స్టార్ గోల్డ్ 2, కలర్స్ సినీప్లెక్స్‌లో ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా మీ ఇంటి ముంగిటకు తీసుకువస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

శనివారం సాయంత్రం టీవీలో ధురందర్

ఇదే విషయంపై ధురంధర్ ఓటీటీ పార్ట్ నర్ జియోస్టార్ ప్రతినిధి మాట్లాడుతూ, “కొన్ని సినిమాలు కేవలం వినోదానికే పరిమితం కాకుండా సాంస్కృతిక దృగ్విషయాలుగా మారతాయి. ధురందర్ అలాంటి చిత్రాలలో ఒకటి. ఈ చిత్రాన్ని టీవీలో ప్రసారం చేయడం ద్వారా, దేశవ్యాప్తంగా ఉన్న కుటుంబాలన్నీ కలిసి కూర్చుని ఈ చిత్రాన్ని చూసేందుకు మేము ఒక సువర్ణావకాశాన్ని కల్పిస్తున్నాం” అని అన్నారు. మరి థియేటర్లు, ఓటీటీలో ధురంధర్ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఇప్పుడు ఎంచెక్కా టీవీల్లోనే చూసి ఎంజాయ్ చేయండి. అయితే తెలుగు వెర్షన్ రావడానికి ఇంకా సమయం పట్టవచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us