Prabhas-Ranbir Kapoor: ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ హీరో స్పెషల్ రోల్.. ఆసక్తికర కామెంట్స్ చేసిన రణబీర్ కపూర్..

ఇటీవలే విడుదలైన ట్రైలర్‏తో మూవీపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇప్పటివరకు ఎన్నడూ చూడని మాస్ అవతారంలో కనిపించనున్నాడు రణబీర్. దీంతో ఈ మూవీపై మరింత హైప్ పెరిగిపోయింది. అయితే కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో మీడియాతో ఇంట్రాక్ట్ అవుతున్నారు యానిమల్ చిత్రయూనిట్. ఇందులో భాగంగా ఇటీవల నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తోన్న “అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె” షోలో యానిమల్ టీమ్ సందడి చేసింది. ఈ షోలో రణబీర్ కపూర్ తన మనసులోని మాటలను బయటపెట్టాడు.

Prabhas-Ranbir Kapoor: ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ హీరో స్పెషల్ రోల్.. ఆసక్తికర కామెంట్స్ చేసిన రణబీర్ కపూర్..
Prabhas, Ranbir Kapoor

Updated on: Nov 25, 2023 | 4:44 PM

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రస్తుతం యానిమల్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రూపొందించిన ఈ పాన్ ఇండియా మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‏గా నటిస్తుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్‏తో మూవీపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇప్పటివరకు ఎన్నడూ చూడని మాస్ అవతారంలో కనిపించనున్నాడు రణబీర్. దీంతో ఈ మూవీపై మరింత హైప్ పెరిగిపోయింది. అయితే కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో మీడియాతో ఇంట్రాక్ట్ అవుతున్నారు యానిమల్ చిత్రయూనిట్. ఇందులో భాగంగా ఇటీవల నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తోన్న “అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె” షోలో యానిమల్ టీమ్ సందడి చేసింది. ఈ షోలో రణబీర్ కపూర్ తన మనసులోని మాటలను బయటపెట్టాడు.

రణబీర్ కపూర్ మాట్లాడుతూ.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ప్రభాస్ చిత్రంలో నటించాలని ఉందని తన కోరికను వ్యక్తం చేశాడు. ” ‘స్పిరిట్’చిత్రంలో అతిధి పాత్రలో నటించడానికి ఇష్టపడతాను. నాకు ప్రభాస్ మంచి స్నేహితుడు. సందీప్ రెడ్డి వంగా తదుపరి చిత్రం ప్రభాస్ అన్నతో ఉంటుంది. అతను నా కోసం చిన్న పాత్ర సృష్టిస్తే.. నేను స్పిరిట్‌లో భాగం కావడానికి ఇష్టపడతాను ”అని రణబీర్ అన్నారు. దీంతో ప్రభాస్, రణబీర్ కపూర్ ఇద్దరిని ఒకే స్క్రీన్ పై చూడాలని అటు అభిమానులు సైతం తమ కోరికలను తెలియజేస్తున్నారు.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోయే రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ స్పిరిట్ చిత్రంలో ప్రభాస్, కీర్తి సురేష్, కరీనా కపూర్ ఖాన్,కియారా అద్వానీ నటించనున్నారని టాక్ వినిపిస్తుంది. యానిమల్ సినిమా రిలీజ్ తర్వాత వచ్చే ఏడాది ప్రభాస్ నటించనున్న స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా , రణబీర్ కపూర్ ప్రస్తుతం ‘యానిమల్’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద బిజినెస్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 1న విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.