Animal Twitter Review: ‘యానిమల్ ‘ ట్విట్టర్ రివ్యూ.. రణబీర్, రష్మిక సినిమా ఎలా ఉందంటే ?..

|

Dec 01, 2023 | 7:45 AM

తండ్రి కొడుకుల అనుబంధం.. ఎమోషన్స్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో రణబీర్ తండ్రిగా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, ప్రతినాయకుడిగా బాబీ డియోల్ నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పేశారు సందీప్. ఈ సినిమా పై ఇప్పటికే భారీ స్థాయిలో బజ్ ఏర్పడింది. డిసెంబర్ 1న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే ఇప్పటికే ఫస్ట్ షో, ప్రీమియర్ చూసిన అడియన్స్ తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటారు.

Animal Twitter Review: యానిమల్  ట్విట్టర్ రివ్యూ.. రణబీర్, రష్మిక సినిమా ఎలా ఉందంటే ?..
Animal Twitter Review
Follow us on

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక నటించిన సినిమా ‘యానిమల్’. గత కొద్ది రోజులుగా పాన్ ఇండియా అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న సందీప్.. హిందీలో తెరకెక్కించిన రెండో సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తండ్రి కొడుకుల అనుబంధం.. ఎమోషన్స్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో రణబీర్ తండ్రిగా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, ప్రతినాయకుడిగా బాబీ డియోల్ నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పేశారు సందీప్. ఈ సినిమా పై ఇప్పటికే భారీ స్థాయిలో బజ్ ఏర్పడింది. డిసెంబర్ 1న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే ఇప్పటికే ఫస్ట్ షో, ప్రీమియర్ చూసిన అడియన్స్ తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటారు. ఇంతకీ రణబీర్, రష్మికల మూవీపై నెటిజన్స్ కామెంట్స్ ఏంటో తెలుసుకుందామా.

యానిమల్ సినిమా డైరెక్టర్ సందీప్ వంగా మార్క్ లోనే ఉందని.. అన్ని అంచనాలను మించేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఇక ఇంటర్వెల్ ఫైట్ అద్భుతంగా ఉందని.. ఫస్ట్ 15 నిమిషాలు అస్సలు మిస్ అవ్వొద్దని.. సినిమా అదిరిపోయిందంటూ కామెంట్ చేశాడు ఓ నెటిజన్.

అలాగే.. బాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన ది బెస్ట్ మూవీ ఇదే అని.. ఇందులో రణబీర్ కపూర్ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇక ఇందులో వయలెన్స్ గురించి చెప్పక్కర్లేదు. మూడు గంటలు ఎక్కడా బోరింగ్ రాకుండా తీశాడంటూ కామెంట్స్ చేశాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.