AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jai Hanuman: జై హనుమాన్‌లో రిషబ్ శెట్టితో పాటు ఆ హీరో కూడా.. ఏ పాత్రలో అంటే

హనుమాన్ సినిమా 400 కోట్ల వరకు వసూల్ చేసింది ఈ సినిమా.. ఇక ఈసినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు  ప్రశాంత్ వర్మ యూనివర్సల్ నుంచి జై హనుమాన్ అనే సినిమా వస్తుంది. ఈ సినిమాలో హనుమంతుడిగా ఎవరు కనిపిస్తారు అని అందరూ ఎదురుచూశారు.

Jai Hanuman: జై హనుమాన్‌లో రిషబ్ శెట్టితో పాటు ఆ హీరో కూడా.. ఏ పాత్రలో అంటే
Jai Hanuman
Rajeev Rayala
|

Updated on: Nov 05, 2024 | 8:53 AM

Share

ప్రశాంత్ వర్మ పేరు  ఈ మధ్య తెగ వినిపిస్తుంది. హనుమాన్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయాడు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్  వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించడమే కాదు.. కలెక్షన్స్ పరంగానూ ఈ సినిమా దుమ్మురేపింది. హనుమాన్ సినిమా 400 కోట్ల వరకు వసూల్ చేసింది ఈ సినిమా.. ఇక ఈసినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు  ప్రశాంత్ వర్మ యూనివర్సల్ నుంచి జై హనుమాన్ అనే సినిమా వస్తుంది. ఈ సినిమాలో హనుమంతుడిగా ఎవరు కనిపిస్తారు అని అందరూ ఎదురుచూశారు. ఎట్టకేలకు హనుమంతుడిగా నటించే నటుడిని అనౌన్స్ చేశాడు ప్రశాంత్ వర్మ.

ఇది కూడా చదవండి : సూపరో సూపర్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగార్జున హీరోయిన్

జై హనుమాన్ సినిమాలో హనుమంతుడిగా కన్నడ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్నాడు. ఇటీవలే రిషబ్ శెట్టి లుక్ ను రిలీజ్ చేశారు. హనుమంతుడి పాత్రలో రిషబ్ అద్భుతంగా కనిపిస్తున్నాడు. కాంతార సినిమాతో రిషబ్ శెట్టి క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. కన్నడలో తెరకెక్కిన కాంతార సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకోవడంతో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా పెరిగిపోయారు.

ఇది కూడా చదవండి : Tollywood : అమ్మబాబోయ్..! రచ్చ రచ్చ చేస్తుందిగా..!! ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ హీరోయిన్ గుర్తుందా..?

ఇక ఇప్పుడు రిషబ్ హనుమంతుడిగా ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే జై హనుమాన్ సినిమాలో రిషబ్ తో పాటు మరో హీరో కూడా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు రానా దగ్గుబాటి. జై హనుమాన్ సినిమాలో రానా కూడా నటిస్తున్నాడని తెలుస్తోంది. అయితే రానా ఏ పాత్రలో నటిసున్నాడు అనేది తెలియాల్సి ఉంది. రిషబ్‌ శెట్టి, రానా దగ్గుబాటి, ప్రశాంత్‌ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని ప్రశాంత్ వర్మ షేర్ చేశారు. దీనికి యూనివర్స్‌‌ ఇన్‌స్టా హ్యాండిల్స్‌ను ట్యాగ్ చేశారు. దాంతో రానా జై హనుమాన్ సినిమాలో ఉన్నాడని కన్ఫర్మ్ అయ్యింది. అయితే అతను ఏ పాత్రలో నటిస్తున్నారు అన్నది తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి : ఈ హీరోలను గుర్తుపట్టారా.? పెద్ద కష్టం కాదులెండి..! కానీ కనిపెట్టండి చూద్దాం.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్