పాన్ ఇండియా స్టార్ దగ్గుబాటి రానాకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిల్మ్ నగర్‍లోని 2200 గజాల స్థల వివాదంలో కోర్టుకు హాజరుకావాలని సిటీ సివిల్ కోర్ట్ ఫస్ట్ సీనియర్ సివిల్ జడ్జ్ రానాకు నోటీసులు పంపించారు. మంగళవారం ఆయన కోర్టుకు హజరయ్యారు. ఫిల్మ్ నగర్ ప్రాంతంలోని 2200 గజాల స్థలాన్ని దగ్గుబాటి ఫ్యామిలీ ఓ వ్యక్తికి లీజ్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే లీజ్ గడువు ముగియక ముందే ఖాళీ చేయాలని తనపై దగ్గుబాటి ఫ్యామిలీ ఒత్తిడి తీసుకువచ్చిందని సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఆ స్థలం హీరో వెంకటేష్, సురేష్ బాబు పేర్లపై ఉంది. ఈ వివాదం కోర్టులో ఉండగానే అక్రమంగా 1000 గజాలను రానా పేరు మీదకు రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. రానా తరపు న్యాయవాది కోర్టుకు తమ వాదనలు వినిపిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.