Ramya Krishnan: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న సీనియర్ బ్యూటీ.. మతిపోగొడుతోన్న రమ్యకృష్ణ న్యూ పిక్స్

|

Jul 20, 2022 | 6:41 PM

అలనాటి అందాల తారల్లో రమ్యకృష్ణ ఒకరు. గ్లామరస్ క్వీన్ గా ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమల్లో ఓ వెలుగు వెలిగారు రమ్యకృష్ణ. ఈ ముద్దుగుమ్మ దాదాపు అందరు  హీరోల సరసన సినిమాల్లో నటించి మెప్పించింది.

Ramya Krishnan: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న సీనియర్ బ్యూటీ.. మతిపోగొడుతోన్న రమ్యకృష్ణ న్యూ పిక్స్
Ramya Krishna
Follow us on

అలనాటి అందాల తారల్లో రమ్యకృష్ణ(Ramya Krishnan) ఒకరు. గ్లామరస్ క్వీన్ గా ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమల్లో ఓ వెలుగు వెలిగారు రమ్యకృష్ణ. ఈ ముద్దుగుమ్మ దాదాపు అందరు  హీరోల సరసన సినిమాల్లో నటించి మెప్పించింది. స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీని వివాహమాడిన తర్వాత సినిమాల్లో జోరు తగ్గించారు రమ్యకృష్ణ. ఇటీవల తల్లి పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ఈ సీనియర్ హీరోయిన్. ఇక జక్కన్న దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రకు ప్రాణం పోశారు రమ్యకృష్ణ. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు రమ్యకృష్ణ. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ తిరిగి సినిమాల్లో బిజీ అవుతున్నారు. ఇటీవలే ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించారు రమ్య. అలాగే డైనమిక్ డైరెక్టర్ పూరీజగనాథ్ దర్శకత్వం వహిస్తోన్న లైగర్ సినిమాలోనూ రమ్య కృష్ణ కీలకపాత్రలో కనిపించనున్నారు.

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమాలో రమ్య కృష్ణ విజయ్ తల్లి పాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే భర్త కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న రంగమార్తాండ సినిమాలోనూ రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే రమ్యకృష్ణ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు తన గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.తాజాగా రమ్యకృష్ణ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. లైట్ ఆరెంజ్ కలర్ చీరలో మైమరపించారు రమ్యకృష్ణ. ఈ సీనియర్ హీరోయిన్ గ్రెస్ ఫుల్ ఫోటోపై మీరూ ఓ లుక్కేయండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి