Ramya Krishna: నాలుగు దశాబ్దాలుగా మకుటం లేని మహారాణి శివగామి.. రమ్యకృష్ణ ఎంత సంపాదిందంటే..

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టస్తోన్న జైలర్ చిత్రంలోనూ ఆమె కీలకపాత్ర పోషించారు. ఇందులో రజినీ భార్యగా కనిపించి మరోసారి తన నటనకు ప్రశంసలు అందుకుంటున్నారు రమ్యకృష్ణ. ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, తమిళంలో పలు చిత్రాల్లో నటించి అలరించింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినీప్రియులను అలరిస్తోన్న రమ్యకృష్ణ ఇప్పటివరకు భారీగానే ఆస్తులు జమచేసినట్లుగా తెలుస్తోంది.

Ramya Krishna: నాలుగు దశాబ్దాలుగా మకుటం లేని మహారాణి శివగామి.. రమ్యకృష్ణ ఎంత సంపాదిందంటే..
Ramya Krishnan

Updated on: Sep 03, 2023 | 8:43 AM

తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అవసరంలేని హీరోయిన్ రమ్యకృష్ణ. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, రజినీకాంత్ వంటి స్టార్ హీరోస్ అందరి సరసన నటించి అలరించారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ రాణిస్తున్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టస్తోన్న జైలర్ చిత్రంలోనూ ఆమె కీలకపాత్ర పోషించారు. ఇందులో రజినీ భార్యగా కనిపించి మరోసారి తన నటనకు ప్రశంసలు అందుకుంటున్నారు రమ్యకృష్ణ. ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, తమిళంలో పలు చిత్రాల్లో నటించి అలరించింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినీప్రియులను అలరిస్తోన్న రమ్యకృష్ణ ఇప్పటివరకు భారీగానే ఆస్తులు జమచేసినట్లుగా తెలుస్తోంది.

రమ్యకృష్ణ 80వ దశకం నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కేవలం హీరోయిన్‏గా కాకుండానే.. ప్రతినాయకురాలిగానూ మెప్పించింది. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో ఆమె పోషించిన శివగామి పాత్ర అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో రజినీ, సౌందర్య కలిసి నటించిన నరసింహ సినిమాలో నీలాంబరి అనే పాత్రలో విలన్ గా కనిపించింది. ఇప్పటికీ వెండితెరపై నీలాంబరి పేరుతో ఓ పేజీని లిఖించుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఒకప్పుడు చేతినిండా సినిమాలతో అగ్రకథానాయికగా బిజీగా ఉన్న రమ్యకృష్ణ.. ఇప్పటికీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ఇప్పటివరకు రమ్యకృష్ణ సినీ ప్రస్థానంలో ఎన్నో మరుపురాని పాత్రలు పోషించారు.  ఇక ఇప్పుడు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. మహేష్ బాబు నటిస్తోన్న గుంటూరు కారం చిత్రంలో నటిస్తుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఒక్కో సినిమాకు రమ్యకృష్ణ రూ.2-3 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఇటీవల ఆమె నటించిన జైలర్ చిత్రానికి దాదాపు రూ. 80 లక్షలు పారితోషికం తీసుకున్నట్లుగా సమాచారం. ఆమెకు మొత్తం రూ.98 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అనేక బ్రాండ్స్ ఉత్పత్తులకు అంబాసిడర్ కూడా. 2003లో డైరెక్టర్ కృష్ణవంశీని పెళ్లి చేసుకున్నారు రమ్యకృష్ణ. వీరికి రిత్విక్ వంశీ బాబు ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.