Ramya Krishna: ఇప్పటి హీరోయిన్స్‌కు అంత సీన్ లేదు.. రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్

| Edited By: TV9 Telugu

Aug 31, 2023 | 4:48 PM

తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్స్ హీరోలతో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు, అంతే కాదు తమిళ్ లోనూ ఈ అమ్మడు చాలా సినిమాల్లో నటించారు. అప్పట్లో గ్లామర్ కు రమ్యకృష్ణ పెట్టింది పేరు. ప్రస్తుతం రమ్యకృష్ణ పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆమెకు బాగా పేరుతెచ్చిన సినిమా ఏది అంటే టాక్కున చెప్పే పేరు బాహుబలి అనే చెప్పాలి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు రమ్యకృష్ణ.

Ramya Krishna: ఇప్పటి హీరోయిన్స్‌కు అంత సీన్ లేదు.. రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్
Ramyakrishna
Follow us on

ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన భామల్లో రమ్యకృష్ణ ఒకరు. నటనకు నటన.. అందానికి అందం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రమ్యకృష్ణ. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించారు రమ్యకృష్ణ. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్స్ హీరోలతో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు, అంతే కాదు తమిళ్ లోనూ ఈ అమ్మడు చాలా సినిమాల్లో నటించారు. అప్పట్లో గ్లామర్ కు రమ్యకృష్ణ పెట్టింది పేరు. ప్రస్తుతం రమ్యకృష్ణ పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆమెకు బాగా పేరుతెచ్చిన సినిమా ఏది అంటే టాక్కున చెప్పే పేరు బాహుబలి అనే చెప్పాలి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు రమ్యకృష్ణ.

ఇక ఇప్పుడు పలు సినిమాల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా ఆమె సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో కనిపించారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ భార్యగా కనిపించారు రమ్యకృష్ణ. ఇదిలా ఉంటే తాజాగా రమ్యకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో అటు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. ఇప్పుడు ఇండస్ట్రీలోరాణిస్తున్న యంగ్ హీరోయిన్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు రమ్యకృష్ణ.

అప్పట్లో మాకు  తప్పులు చేయడానికి..వాటిని కరెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. మేము ఎన్నో ఏళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బును ఇప్పటి హీరోయిన్స్ తక్కువ సమయంలోనే సంపాదిస్తున్నారు. టైమ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ అంచనా వేయలేరు అని తెలిపారు రమ్యకృష్ణ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.