
తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ రమ్యకృష్ణ. దక్షిణాది చిత్రపరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ సొంతం చేసుకున్న ఆమె తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో అనేక సినిమాల్లో కనిపించింది. ఒకప్పుడు హీరోయిన్ గా అలరించిన ఆమె.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో సహయ నటిగా రాణిస్తుంది. యంగ్ హీరోహీరోయిన్లకు తల్లిగా, అత్తగా కనిపిస్తుంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా కెరీర్ పీక్స్ లో ఉండగానే నీలాంబరిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో రఫ్పాడించింది. డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమాతో శివగామి పాత్రలో పాన్ ఇండియా అడియన్స్ హృదయాలు గెలుచుకుంది. బాహుబలి సినిమా రమ్యకృష్ణ క్రేజ్ ను మరోసారి తారాస్థాయికి చేర్చింది.
బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో ఆమె తప్ప మరెవ్వరూ నటించలేరు అనేలా అద్భుతంగా నటించారు రమ్యకృష్ణ. ఇదిలా ఉంటే రమ్యకృష్ణకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బాహుబలి సినిమాను రెండు పార్ట్స్ గా తెరకెక్కించాడు రాజమౌళి. ఇప్పుడు బాహుబలి ఎపిక్ పేరుతో రీ రిలీజ్ చేయనున్నారు. రెండు పార్ట్స్ కలిపి ఒక్కటే పార్ట్ గా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో రమ్యకృష్ణ సీన్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
రమ్యకృష్ణ పార్ట్ వన్ లో అప్పుడే పుట్టిన బాహుబలిని ఎత్తుకొని సీరియస్ గా నడుచుకుంటూ వచ్చే సీన్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఆ సీన్ షూటింగ్ కు సంబంధించిన వీడియోనే ఇది.. అప్పటివారకు చేతిలో ఉన్న బిడ్డతో ఆడుకుంటున్న రమ్యకృష్ణ ఒక్కసారి యాక్షన్ చెప్పగానే.. క్యారెక్టర్ లోకి దూరిపోయారు. వెంటనే సీరియస్ లుక్ లోకి మారిపోయి నడుచుకుంటూ వస్తారు. క్షణాల్లో ఆమె హావభావాలను మార్చుకోవడం నిజంగా అద్భుతం అనే చెప్పాలి. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. రమ్యకృష్ణ సైతం ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..