Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramoji Rao: రామోజీ రావు అంతిమయాత్ర.. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అక్షర యోధుడికి అశ్రునివాళి..

కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామోజీ రావు.. ఈ నెల 5న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను నానక్ రామ్ గూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. రామోజీ రావు మరణం పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Ramoji Rao:  రామోజీ రావు అంతిమయాత్ర.. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అక్షర యోధుడికి అశ్రునివాళి..
Ramoji Rao
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 09, 2024 | 9:52 AM

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీ రావు అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. ఈరోజు ఉదయం తెలంగాణ ప్రభుత్వ అధికారి లాంఛనాలతో రామెజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి అంతి సంస్కారాలు ప్రారంభం అయ్యాయి. రామోజీ అంత్యక్రియలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. శనివారం ఉదయం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలోని కార్పొరేట్ భవన సముదాయంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచగా.. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు రామోజీ రావుకు నివాళులర్పించారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామోజీ రావు.. ఈ నెల 5న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను నానక్ రామ్ గూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. రామోజీ రావు మరణం పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

రామోజీ రావు మరణం పట్ల సంతాపం తెలుపుతూ ఆదివారం, సోమవారం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. అలాగే రామోజీ మృతికి గౌరవసూచకంగా ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్స్ నిలిపేస్తున్నట్లు నిర్మాత మండలి నిర్ణయం తీసుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతివనంలో నిర్వహించనున్న అంత్యక్రియల ఏర్పాట్లను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కె.శశాంక, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి, ఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంత్ రెడ్డి పరిశీలించారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు రామోజీ రావు అంత్యక్రియలకు తరలివస్తున్న నేపథ్యంలో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలని సీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు.

రామోజీ రావు అంత్యక్రియల కార్యక్రమాన్ని వేదిక వెలుపల ఎల్ఈడీ తెరల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని రామోజీ ఫిల్స్ సిటీ ప్రతినిధులకు పోలీసులు సూచించారు. ఇక శనివారం రామోజీరావు పార్థివదేహానికి ప్రముఖులు నివాళులర్పించారు, చంద్రబాబు, చిరంజీవి, పవన్‌ల్యాణ్‌, లోకేష్‌, రాజమౌళి, రాఘవేంద్రరావు, కీరవాణి, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం సహా సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. రామోజీరావు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ముగ్గురు IAS అధికారులు RP సిసోడియా, సాయిప్రసాద్‌, రజత్‌ భార్గవ్‌ను పంపిస్తోంది ఏపీ ప్రభుత్వం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.