Tollywood Actors: టాలీవుడ్ స్టార్స్ పై బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ నోటి దురుసు.. తెలుగు హీరోలపై షాకింగ్ కామెంట్స్..

ఈ క్రమంలోనే ఇటు సౌత్ హీరోలను తెగ పొగిడేశారు. దక్షిణాదిలో స్టార్స్ అందరూ సింపుల్ గా ఉంటారని.. వారిలో ఎలాంటి యాటిట్యూడ్ కనిపించదంటూ బీటౌన్ హీరోలతో పోలుస్తూ కామెంట్స్ చేశారు. ఇక తాజాగా టాలీవుడ్ హీరోలపై సంచలన కామెంట్స్ చేశాడు బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ వీరేందర్ చావ్లా. సౌత్ హీరోలంతా ఫేక్ అని.. కెమెరా ముందు వాళ్లంతా నటిస్తారని అన్నారు.

Tollywood Actors: టాలీవుడ్ స్టార్స్ పై బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ నోటి దురుసు.. తెలుగు హీరోలపై షాకింగ్ కామెంట్స్..
Vijay Deverakonda, Jrntr, M
Follow us

|

Updated on: Jun 09, 2024 | 7:27 AM

ప్రస్తుతం ఇండియన్ సినిమా అంటే ఠక్కున తెలుగు చిత్రపరిశ్రమ గుర్తుకువస్తుంది. బాహుబలి సినిమాతో టాలీవుడ్ రేంజ్ మార్చేశాడు డైరెక్టర్ రాజమౌళి. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు అందుకున్నాడు. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ వేదికపై సందడి చేసి.. ప్రపంచ దృష్టించి ఆకర్షించారు. ఇప్పుడు తెలుగు సినిమాలను విదేశీయులు కొనియాడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. నెపోటిజం, యాక్టర్స్ యాటిట్యూడ్ పై అడియన్స్ బహిరంగంగానే కామెంట్స్ చేశారు. అలాగే సోషల్ మీడియాలో బైకాట్ బాలీవుడ్ అనే ట్యాగ్ తెగ వైరలయ్యింది. చాలాకాలం పాటు హిందీలో రిలీజ్ అయిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇటు సౌత్ హీరోలను తెగ పొగిడేశారు. దక్షిణాదిలో స్టార్స్ అందరూ సింపుల్ గా ఉంటారని.. వారిలో ఎలాంటి యాటిట్యూడ్ కనిపించదంటూ బీటౌన్ హీరోలతో పోలుస్తూ కామెంట్స్ చేశారు. ఇక తాజాగా టాలీవుడ్ హీరోలపై సంచలన కామెంట్స్ చేశాడు బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ వీరేందర్ చావ్లా. సౌత్ హీరోలంతా ఫేక్ అని.. కెమెరా ముందు వాళ్లంతా నటిస్తారని అన్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరేందర్ చావ్లా మాట్లాడుతూ.. “సౌత్ సెలబ్రెటీస్ మొత్తం ఫేక్ గా కనిపిస్తారు. వారంతా కెమెరా ముందు తాము ఎంతో ఒదిగి ఉన్నట్లు నటిస్తారు. కానీ వారు ఎలా ఎప్పుడు సహనం కోల్పోతారో చెప్పలేం. ఒక హీరో (విజయ్ దేవరకొండ) సినిమా ప్రమోషన్లకు చెప్పులు వేసుకుని వచ్చాడు. సింపుల్ గా ఉన్నట్లు చూపించుకోవడానికి అలా నటించాడు. మరో హీరో (జూనియర్ ఎన్టీఆర్) ఎప్పుడూ సైలెంట్ గా ఉంటాడు. అతడు ఓ హోటల్ కు వెళ్తుండగా.. ఫోటోగ్రాఫర్ అతడిని వీడియో తీశాడు. వెంటనే ఆయన మా పై కోప్పడ్డాడు. నిజానికి అతడి ఫోటో తీసింది వేరే వ్యక్తి. కానీ అతనడు మాపై కోప్పడ్డాడు. అలాగే మరో సూపర్ స్టార్ (మహేష్ బాబు) బాలీవుడ్ నాకు అవసరం లేదని చెప్పాడు. అతడు ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నారేంటీ అనుకున్నాను. సౌత్ హీరోలు చాలా ఫేక్. బాలీవుడ్ హీరోస్ లోపల, బయట ఒకేలా ఉంటారు” అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం వీరేందర్ చావ్లా చేసిన కామెంట్స్ నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో మరోసారి బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ ట్యాగ్ నెట్టింట ట్రెండ్ అవుతుంది. వీరేందర్ చావ్లా చేసిన కామెంట్స్ పై సౌత్ అడియన్స్ మండిపడుతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ అనవసరంగా ఇతరులను తక్కువ చేస్తూ మాట్లాడుతుంటారని.. అలాగే హిందీలో నెపోటిజం ఎక్కువగా ఉంటుందని.. కొత్తవారికి అసలు అవకాశాలు ఇవ్వరంటూ కౌంటరిస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.