ఒక్క సినిమా హిట్ అయితే చాలా మోస్ట్ వాంటెడ్ హీరోలు, హీరోయిన్లు అయిపోతారు.. వరుస ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటారు.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టేసి ఫుల్ బిజీగా మారిపోతుంటారు. ఈ టైంలోనే సందు చూసుకొని రెమన్యురేషన్ పెంచేస్తుంటారు. ఇప్పుడు ఈ యంగ్ హీరో కూడా రెమ్యునరేషన్ ను పెంచేసి నిర్మాతలకు షాక్ ఇస్తున్నాడు. ఆ కుర్రహీరో ఎవరో కాదు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. రామ్ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అయ్యింది. ఇప్పటి వరకు రామ్ 18సినిమాల్లో నటించారు. కాకపోతే సాలిడ్ హిట్స్ మాత్రం మూడు నాలుగు మాత్రమే ఉన్నాయి. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ కు సరైన కథతో హిట్ అందించారు డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్ సినిమా ఇచ్చిన కిక్ తో అదే జోష్ లో వరుసగా సినిమాలు చేస్తున్నాడు రామ్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అప్పటివరకు చాక్లెట్ బాయ్ గా ఉన్న రామ్ మాస్ హీరోగా మారిపోయాడు. ఆతర్వాత వచ్చిన రెడ్ సినిమాలోనూ మాస్ క్యారెక్టర్ లో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు లింగు స్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
తెలుగు తమిళ్ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకూడా యాక్షన్ ఎంటైర్ టైనర్ గా తెరకెక్కుతోందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకోసం రామ్ భారీ రెమ్యునరేషన్ ను అందుకోనున్నాడట. ఇప్పటివరకు మీడియం రేంజ్ హీరోగానే గుర్తింపు తెచ్చుకున్న రామ్ ఇక పై స్టార్ హీరోగా మారాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే తన రెమ్యునరేషన్ కూడా పెంచేసాడట. లింగు స్వామి సినిమాకోసం రామ్ 13 కోట్లు తీసుకోనున్నాడని టాక్ నడుస్తుంది. నిన్నమొన్నటి వరకు 10లోపు ఉన్న రెమ్యునరేషన్ ను ఇప్పుడు 13 కోట్లకు పెంచడం పై ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :