Ram Pothineni : శరవేగంగా ఇస్మార్ హీరో నయా మూవీ షూటింగ్.. వినాయక చవితికి సర్‌‌ప్రైజ్ ఉండనుందా మరి..?

|

Aug 20, 2021 | 7:25 PM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత కథల విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాడు. ప్రేక్షకులకు రీచ్ అయ్యే కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.

Ram Pothineni : శరవేగంగా ఇస్మార్ హీరో నయా మూవీ షూటింగ్.. వినాయక చవితికి సర్‌‌ప్రైజ్ ఉండనుందా మరి..?
Ram
Follow us on

Ram Pothineni : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమాతర్వాత కథల విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాడు. ప్రేక్షకులకు రీచ్ అయ్యే కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా కంటే ముందు రామ్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాయి. వరుసగా సినిమాలు చేస్తూ వచ్చినా అవి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఆ సమయంలో డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ అంటూ రామ్‌ను సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకు‌వచ్చాడు. అప్పటి వరకు చాక్లెట్ బాయ్‌గా ఉన్న రామ్‌ను మాస్ హీరోగా మార్చేశాడు పూరి. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత తిరుమల కిషోర్ దర్శకత్వంలో రెడ్ అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో మొదటిసారి డ్యూయల్ రోల్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు రామ్. ఇక ఇప్పుడు తమిళ్ దర్శకుడు లింగు స్వామి డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా లేటెస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి నటిస్తుంది.

ఈ సినిమా మాస్ ఆడియన్స్‌తోపాటు అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు. అందమైన ప్రేమ కథతోపాటు అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండనున్నాయట ఈ మూవీలో. అలాగే రామ్ ఈ సినిమాలో చాలా స్టైలిష్ లుక్‌లో  కనిపించబోతున్నట్లుగా టాక్. ఈ మధ్యే సినిమా షూటింగ్ ను మొదలుపెట్టరు. తాజాగా ఈ మూవీ మొదటి షెడ్యూల్ ను ముగించారు. హైదరాబాద్ మరియు చెన్నైలో మొదటి షెడ్యూల్ ను నిర్వహించారు. సినిమాకు సంబంధించిన మేజర్ పార్ట్ చిత్రీకరణ ముగించిన దర్శకుడు లింగు స్వామి త్వరలో తదుపరి షెడ్యూల్‌ను మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ వినాయక చవితి సందర్బంగా విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bandla Ganesh: బండ్లేశ్వరా..! 48 ఏళ్ల వయస్సులో హీరోగా టర్న్.. ఆ హిట్ సినిమాకు రీమేక్.. సెప్టెంబరు ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్‌

Rakul Preet Singh: రకుల్ ప్రీత్‌కు క్రేజీ ఆఫర్.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న ఢిల్లీ సుందరి..

Aakaasam Nee Haddhu Ra : సూర్య సినిమాకు అవార్డుల పంట.. మారో ఘనత సాధించిన ఆకాశం నీ హద్దురా..