Ram- Lakshman: బాలయ్య, చిరంజీవి సినిమాల్లో ఆ సీన్స్ చూస్తే కంటతడి పెట్టాల్సిందే.. రామ్- లక్ష్మణ్ మాస్టర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

|

Dec 31, 2022 | 7:55 PM

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా ఈ రెండు సినిమాలను తెరకెక్కిస్తున్నారు.

Ram- Lakshman: బాలయ్య, చిరంజీవి సినిమాల్లో ఆ సీన్స్ చూస్తే కంటతడి పెట్టాల్సిందే.. రామ్- లక్ష్మణ్ మాస్టర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Ram Lakshman
Follow us on

సంక్రాంతి పండగకు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ ఇద్దరు బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. వీరసింహ రెడ్డిగా బాలయ్య, వాల్తేరు వీరయ్య గా మెగాస్టార్ ఇద్దరు సంక్రాంతిని టార్గెట్ చేసుకొని బరిలోకి దిగుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా ఈ రెండు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న వాల్తేరు వీరయ్య జనవరి 13న విడుదలౌతుండగా, ‘వీరసింహారెడ్డి’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ గా రూపొందిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలకు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. ఈ సందర్భంగా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల విశేషాలని పంచుకున్నారు రామ్ లక్ష్మణ్.

యాక్షన్ ఐడియాలు ఇద్దరిలో ఎవరికైనా రావచ్చు. మా అదృష్టం ఏమిటంటే ఇద్దరంవున్నాం కాబట్టి రెండు ఆప్షన్స్ ని డైరెక్టర్ గారి దగ్గరికి తీసుకెళతాం. అందులో ఒక ఆప్షన్ డైరెక్టర్ గారికి నచ్చుతుంది. మేము ఇలానే ప్లాన్ చేసుకుంటాం అన్నారు. ఫైట్ కి కాన్సెప్ట్ ఉండాల్సిందే. లేకపోతే ఫైట్ కి పరిపూర్ణత రాదు. ఫైట్ అనేది ఎప్పటినుండో ఉన్నప్పటికీ ప్రేక్షకుడికి బోర్ కొట్టదు. ఒక ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్, క్యారెక్టరైజేషన్, కొత్తదనం ని యాడ్ చేసి ఒక కాన్సెప్ట్ గా ఫైట్ ని కంపోజ్ చేయడం వలనే థియేటర్ లో ప్రేక్షకులు విజల్స్, చప్పట్లు కొట్టిమరీ ఎంజాయ్ చేస్తారు.

క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ ప్రకారం కూడా యాక్షన్ డిజైన్ చేయాలి. వీరసింహారెడ్డిలో బాలయ్య బాబు చైర్ లో కూర్చుని వుంటారు. ఎదురుగా రౌడీలు వస్తుంటారు. బాలయ్య బాబు గారి క్యారెక్టరైజేషన్ ప్రకారం.. ఈ రౌడీలని కూడా నిల్చునికొట్టాలా ? అనే ఆలోచన వచ్చింది. దీంతో బాలయ్య బాబు గారు చైర్ లో కూర్చునే ఒక పవర్ ఫుల్ ఫైట్ ని కంపోజ్ చేశాం. చైర్‌లో కూర్చునే ఫైట్ చేయొచ్చు అనే మూడ్ చాలా అద్భుతంగా క్రియేట్ అయ్యింది. అది బాలయ్య బాబు గారి క్యారెక్టరైజేషన్ లో వున్న మ్యాజిక్ అని అన్నారు. వీరసింహా రెడ్డి ఇంటర్వెల్ ఫైట్ టర్కీలో చేశాం. అక్కడ భారీగా ఖర్చయ్యింది. ఫైట్ చాలా పవర్ ఫుల్ గా వుంటుంది అన్నారు.

ఇవి కూడా చదవండి

చిరంజీవి గారి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ గారి ‘వీరసింహారెడ్డి’ రెండు భిన్నమైన కథలు. దర్శకులు బాబీ, గోపీచంద్ మలినేని రెండు భిన్నమైన క్యారెక్టరైజేషన్స్, బాడీ లాంగ్వేజ్ రాసుకున్నారు. రెండు డిఫరెంట్ గా వుండటం వలన క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు యాక్షన్ కంపోజ్ చేయడం జరిగింది. బాలకృష్ణ గారి వీరసింహా రెడ్డిలో ఎమోషనల్ ఇంటర్వెల్ బ్యాంగ్ చూస్తే ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టాల్సిందే. మేము స్పాట్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నాం. అలాగే వాల్తేరు వీరయ్యలో అన్నయ్య, రవితేజ గారి మధ్య ఒక ఎమోషనల్ డ్రామా వుంటుంది. అన్నయ్య అద్భుతంగా చేశారు. ఇదీ కన్నీళ్లు తెప్పిస్తుంది అని అన్నారు.