Omicron: 1963లోనే ఓమిక్రాన్ పెద్ద సెన్సేషన్.. ఆర్జీవి సంచలన ట్వీట్..

|

Dec 02, 2021 | 9:46 PM

క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్పటివరకు డెల్టాగా మనకు తెలుసు. తాజాగా ప‌రివ‌ర్తనం చెంది ఒమిక్రాన్ వేరియంట్‌గా...

Omicron: 1963లోనే ఓమిక్రాన్ పెద్ద సెన్సేషన్.. ఆర్జీవి సంచలన ట్వీట్..
Follow us on

క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్పటివరకు డెల్టాగా మనకు తెలుసు. తాజాగా ప‌రివ‌ర్తనం చెంది ఒమిక్రాన్ వేరియంట్‌గా ప్రపంచ దేశాల‌ను వణికిస్తోంది. ద‌క్షిణాఫ్రికాలో బ‌య‌ట‌ప‌డిన ఈ వేరియంట్ ఇప్పుడు భార‌త్‌లోకి కూడా వ‌చ్చేసింది. బెంగ‌ళూరులో రెండు కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ధ్రువీక‌రించింది. అయితే ఈ ఒమిక్రాన్ ఇప్పుడే కాదు.. 1963లో కూడా వ‌చ్చింద‌ట. అయితే అదేమీ క‌రోనా వైర‌స్ కాదు.. అది ఓ ఇటాలియ‌న్ సినిమా. ప్రముఖ వ్యాపార‌వేత్త ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్ చేయ‌డంతో ఇప్పుడు ఈ ఒమిక్రాన్‌ సినిమా గురించి అందరికీ తెలిసింది.

1963లోనే వ‌చ్చిన ఓమిక్రాన్‌ సినిమా గురించి వివాదాస్పద ద‌ర్శకుడు రామ్‌గోపాల్ వ‌ర్మ కూడా సంచ‌ల‌న ట్వీట్ చేశారు. “ఓమిక్రాన్ వేరియంట్‌పై 1963లోనే ఒక సినిమా వ‌చ్చింది. ఒక సారి ట్యాగ్‌లైన్ చూడండి” అంటూ ఓమిక్రాన్ వేరియంట్ అనే సినిమా పోస్టర్‌ను ఎటాచ్‌ చేశారు. అందులో ‘ఆ రోజు భూమి స్మశానంగా మారబోతోంది’ అనే ట్యాగ్‌లైన్ కూడా ఉంది. ఈ ట్వీట్‌పై నెటిజ‌న్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఓమిక్రాన్ వేరియంట్‌పై ఇప్పటికే ప‌లు సినిమాలు వ‌చ్చిన‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్రచారం జ‌రుగుతోంది. ఈ మేర‌కు ప‌లు ఫేక్ మూవీ పోస్టర్లు కూడా ఆన్‌లైన్‌లో చ‌క్కర్లు కొడుతున్నాయి. 1963లో వ‌చ్చిన ఇటాలియ‌న్ సినిమా పేరు ఓమిక్రాన్‌. ఇప్పటివ‌ర‌కు ఓమిక్రాన్ వేరియంట్‌పై రెండు సినిమాలు మాత్రమే వ‌చ్చాయి. అందులో ఒక‌టి 1963లో వ‌చ్చిన ఇటాలియ‌న్ మూవీ ఓమిక్రాన్‌. రెండోది 1999లో వ‌చ్చిన ప్రాజెక్ట్ ఓమిక్రాన్.

ఇవి కూడా చదవండి:

ఈ 3 రాశులవారు చాలా డేంజర్.. పగ పెంచుకున్నారో ఇక అంతే! ఏయే రాశులంటే.!

ఈ చిరునవ్వుల చిన్నది ఇప్పుడొక టాలీవుడ్ హీరోయిన్.. మన తెలుగమ్మాయి కూడా.. ఎవరో కనిపెట్టండి!

వామ్మో.! ఆమెకు ఇదేం వింత అలవాటు.. భర్త కూడా దానికి ఒప్పుకున్నాడట.!!