Ram Gopal Varma: చనిపోయినవారికి RIP అని చెప్పడమంటే వారిని అవమానించడమే.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ వైరల్..

|

Feb 07, 2022 | 5:52 PM

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma).. చెప్పాలనుకున్నది చెప్పేస్తాడు.. చేయాలనుకున్నది చేసేస్తాడు. ఇతరుల ఏమానుకుంటున్నారో అనవసరం అంటాడు.

Ram Gopal Varma: చనిపోయినవారికి RIP అని చెప్పడమంటే వారిని అవమానించడమే.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ వైరల్..
Ram Gopal Varma
Follow us on

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma).. చెప్పాలనుకున్నది చెప్పేస్తాడు.. చేయాలనుకున్నది చేసేస్తాడు. ఇతరుల ఏమానుకుంటున్నారో అనవసరం అంటాడు.. ఇక వర్మ ఎప్పుడు ఏ కామెంట్స్ చేస్తాడు.. ఏ విషయం పై ఎలా స్పందిస్తాడో ఊహించడం కష్టమే. అయినా వర్మ చేసే కామెంట్స్ పట్ల యూత్ తెగ అట్రాక్ట్ అవుతుంటారు. ఆర్జీవి (RGV) చేసే పోస్ట్స్ క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సినిమా అంశాలే కాకుండా.. సమాజంలో జరుగుతున్న విషయాలపై తనదైన శైలీలో స్పందిస్తుంటారు ఆర్జీవి. తాజాగా చనిపోయిన వారికి RIP అని రాయడమంటే.. వారిని అవమానించడమే అంటూ ట్వీట్ చేశారు వర్మ. ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్స్ నెట్టింట్లో హాట్ టాపిక్‏గా మారాయి.

“మన భూమి మీద విశ్రాంతి తీసుకునేవారిని మనం సోమరిపోతులు అంటారు.. అందుకే ఓ వ్యక్తి చనిపోయినప్పుడు వారికి RIP అనే చెప్పే బదులు.. మంచి జీవితాన్ని గడపండి.. మరింత ఎంజాయ్ చేయండి అని రాయండి ” అంటూ ట్వీట్ చేశారు వర్మ. అలాగే ఓ వ్యక్తి చనిపోతే అందరూ బాధపడుతుంటారని.. ఓ మంచి వ్యక్తిని కోల్పోయామని అనుకుంటారని..కానీ.. ఆ చనిపోయిన వ్యక్తి ఇక్కడి నుంచి మరో మంచి ప్రదేశానికి వెళ్లాడని భావించండి.. అందుకు సెలబ్రేట్ చేసుకోండి.. ఓ చెడు వ్యక్తి చనిపోతే అసలు బాధపడాల్సిన అవసరం ఏముంటుందంటూ ప్రశ్నించారు ఆర్జీవి. అలాగే చనిపోవడానికి భయపడేవాళ్లు.. పాపం చేశామని.. అందుకే నరకానికి వెళ్తామని భయపడతారు. అలాగే పాపం చేసిన వాళ్లు స్వర్గానికి వెళ్తారు. కాబట్టి వారు సంతోషంగా ఉండాలి అంటూ వరుస ట్వీట్స్ చేశారు వర్మ. ఆయన చేసిన ట్వీట్స్ పై నెటిజన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

Also Read: Lata Mangeshkar: రాజ్‌కపూర్‌పై అలిగిన లతా మంగేష్కర్.. ఎందుకు అలా చేసిందంటే..

Lata Mangeshkar: అసంపూర్ణంగా మిగిలిపోయిన ప్రేమ వాళ్లది.. లతా మంగేష్కర్ ప్రేమ ద్వేషంగా ఎందుకు మారిందో తెలుసా..

Pawan Kalyan-Statue of Equality: సమతామూర్తి భగవద్ రామానుజాచార్య సన్నిధిలో ‘పవన్ కళ్యాణ్’.. చినజీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్న ‘జనసేనని’ ఫొటోస్..

Shruti Haasan: పచ్చని ప్రకృతి నడుమ ఫోటోలకు ఫోజులిచ్చిన ‘శ్రుతి హాసన్’ సొగసులు చూడతరమా..(ఫొటోస్)