Ram Gopal Varma : ఏపీ రాజకీయ నాయకులపై సెటర్లు వేసిన ఆర్జీవీ.. ఏమన్నారంటే..

వివాదం ఎక్కడుంటే వర్మ అక్కడ ఉంటారు.. వర్మ ఏం మాట్లాడిన అది సంచలనమే... ఇది బయట జనాల టాక్. అదే నిజం కూడా.. దేశంలోనే కాదు ప్రపంచం మొత్తమీద ఎక్కడ ఎం జరిగిన ఆర్జీవీ

Ram Gopal Varma : ఏపీ రాజకీయ నాయకులపై సెటర్లు వేసిన ఆర్జీవీ.. ఏమన్నారంటే..
RGV

Updated on: Oct 21, 2021 | 8:29 PM

Ram Gopal Varma : వివాదం ఎక్కడుంటే వర్మ అక్కడ ఉంటారు.. వర్మ ఏం మాట్లాడిన అది సంచలనమే… ఇది బయట జనాల టాక్. అదే నిజం కూడా.. దేశంలోనే కాదు ప్రపంచం మొత్తమీద ఎక్కడ ఎం జరిగిన ఆర్జీవీ తన స్టైల్ లో స్పందిస్తూనే ఉంటారు. అలాంటిది మన తెలుగు రాష్ట్రాల్లో జరిగే సంఘటనలను వదిలిపెడతారా.. తాజాగా ఏపీలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే.. తెలుగు దేశం పార్టీ నేత పట్టాభి ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై చేసిన వ్యాఖ్యలకు వైసీపీ అభిమానులు ఆందోళ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దేశం కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డరు. అంతే కాదు జగన్ పై వ్యాఖ్యలు చేసిన పట్టాభిని అరెస్ట్ కూడా చేశారు పోలీసులు. అయితే ఈ వ్యవహారం పై ఆర్జీవీ తనదైన శైలిలో స్పందించారు.

ట్విట్టర్ వేదికగా వర్మ స్పందిస్తూ.. ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. రాజకీయ నాయకులంతా బాక్సింగ్, కరాటే, కర్రసాము వంటివి నేర్చుకోవాలి అంటూ సెటైర్లు వేశారు వర్మ. ఇక వర్మ ట్వీట్ పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నాడు. వర్మ చెప్పినదాంట్లోనూ నిజం ఉంది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anasuya Photos: చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప.. ‘అనసూయ’ ర్యాండమ్ క్లిక్ పై మీరు ఓ లుక్కేయండి

Kushboo Photos: స్టన్నింగ్ లుక్స్ తో ఏజ్ కనిపించకుండా కుర్రకారును ఎట్రాక్ట్ చేస్తున్న ‘కుష్బూ’ న్యూ ఫొటోస్…

Samantha: కోర్టులో సమంతకు కొత్త ట్విస్ట్.. పిటిషన్ అత్యవసర విచారణకు అభ్యంతరం